కొత్త ఫోన్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? రూ. 15వేలలో బెస్ట్‌ ఫీచర్స్‌

www.mannamweb.com


మార్కెట్లో రోజుకో కొత్త ఫోన్‌ సందడి చేస్తోంది. మరీ ముఖ్యంగా బడ్జెట్ మార్కెట్లో అధునాతన ఫీచర్లతో కూడిన ఫోన్‌లను తీసుకొస్తున్నాయి కంపెనీలు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సెప్టెంబర్‌ నెలలో అందుబాటులోకి వచ్చిన కొన్ని బెస్ట్ స్మార్ట్‌ ఫోన్స్‌ ఏంటి.? వాటి ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

CMF Phone 1: లండన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ నథింగ్‌కు చెందిన సీఎమ్‌ఎఫ్‌ ఫోన్‌ 1 బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఈ ఫోన్‌ 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర అన్ని ఆఫర్లు కలుపుకొని రూ. 15వేల లోపు లభిస్తోంది. ఈ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

Motorola G64: రూ. 15 వేల లోపు అందుబాటులో ఉన్న మరో బెస్ట్ ఫోన్‌ మోటో జీ64. ఈ ఫోన్‌లో 6.5 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ ఐపీసీ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. అలాగే ఇందులో 33 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 6000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

Poco M6 Plus: తక్కువ ధరలో అందుబాటులో ఉన్న మరో బెస్ట్‌ ఫోన ఫోకో ఎమ్‌6 ప్లస్‌. ఈ ఫోన్‌ 6.79 ఇంచెస్‌తో కూడిన ఎల్‌సీడీ స్క్రీన్‌ను అందించారు. 550 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ఈ స్క్రీన్‌ సొంతం. 33 వాట్స్‌ ఛార్జర్‌కు సపోర్ట్ చేసే 5030 ఎమ్‌ఏహెచ్‌తో కూడిన బ్యాటరీని అందించారు.

Samsung Galaxy F15 5G: ఈ స్మార్ట్ ఫోన్‌ ప్రారంభ వేరియంట్‌ ధర రూ. 12,999గా ఉంది. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.5 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌తో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు.

Vivo T3x: ఈ 5జీ స్మార్ట్‌ ఫోన్‌ రూ. 13,499కి అందుబాటులో ఉంది. అదనంగా పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 1000 డిస్కౌంట్ లభిస్తుంది. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.72 ఇంచెస్‌తో కూడిన ఫ్లాట్‌ ఫుల్‌ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. 44 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 6000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇందులో అందించారు.