భారతదేశంలో పండుగ సీజన్ మొదలైపోయింది. ఈ సమయంలో తమ కస్టమర్లకు మెరుగైన సేవలను అందించాలనే ఉద్దేశ్యంతో.. ఈ కామర్స్ సంస్థలు భారీ ఉద్యోగాలను సృష్టిస్తున్నాయి.
ఇప్పటికే ఈ జాబితాలో మీషో చేరింది. ఇప్పుడు తాగాజా అమెజాన్ అడుగుపెట్టింది.
అమెజాన్ ఇండియా 1.1 లక్షలకు పైగా సీజనల్ ఉద్యోగాలను కల్పించనున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. ముంబై, ఢిల్లీ, పూణే, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా, లక్నో, చెన్నై వంటి నగరాల్లో ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు కల్పించనున్నట్లు సమాచారం. ఇందులో మహిళలు, వికలాంగుల సంఖ్య భారీగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
దేశంలోని అన్ని ప్రాంతాల కస్టమర్ల అవసరాలను సకాలంలో తీర్చడానికి అమెజాన్ ఈ ఉద్యోగాలను సృష్టించింది. పండుగ సీజన్‌లో.. భారతదేశం అంతటా 1 లక్షకు పైగా ఉపాధి అవకాశాలను కల్పిస్తున్న అమెజాన్ చర్య ప్రశంసనీయమైన కేంద్ర కార్మిక & ఉపాధి మంత్రి ‘మన్సుఖ్ మాండవియా’ పేర్కొన్నారు.
ప్రాజెక్ట్ ఆశ్రయ్
అమెజాన్ ఇండియా ప్రాజెక్ట్ ఆశ్రయ్ వంటి కార్యక్రమాలను కూడా ప్రవేశపెట్టింది. దీని ద్వారా నగరాల్లో డెలివరీ అసోసియేట్‌ల కోసం ప్రత్యేక విశ్రాంతి పాయింట్లు ఏర్పాటు చేస్తోంది. ఇవి ఢిల్లీ NCR, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
మూడు నెలల్లో భారీగా ఉద్యోగాలు.. ఈ రంగాల్లోనే అధికం
అమెజాన్ సుశ్రుత అనే ఒక సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. దీని ద్వారా ట్రక్ డ్రైవర్‌లకు ముందస్తుగా గుర్తించడం, రోగనిర్ధారణ చేయడం, ఎంచుకున్న ప్రాంతాలలో ఆరోగ్య శిబిరాల ద్వారా ఆరోగ్య సంరక్షణ సహాయాన్ని అందిస్తుంది. అంతే కాకుండా అమెజాన్ ఇండియా తన ఉద్యోగులకు ఆన్‌సైట్ వైద్య సదుపాయాల వంటి వివిధ సౌకర్యాలను అందజేస్తుంది.