ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది భారతీయులు నివసిస్తున్న 10 దేశాలు ఇవే

ప్రపంచ వలస నివేదిక 2024 ప్రకారం, అంతర్జాతీయ వలసదారులలో (281 మిలియన్లు) భారతీయులే అతిపెద్ద సమూహంగా ఉన్నారు. దాదాపు 18 మిలియన్ల మంది భారతీయులు స్వదేశం వెలుపల నివసిస్తున్నారు.


భారతీయ సంతతికి చెందిన వారిని కూడా కలుపుకుంటే ఈ సంఖ్య 35 మిలియన్లకు పైగా పెరుగుతుంది. మరి అవకాశాలను బట్టి అత్యధిక భారతీయులు ఏ దేశాల్లో నివసిస్తున్నారు? భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో ఉన్న వివరాల ప్రకారం..

అగ్రస్థానంలో ఉన్న దేశాలు:
అమెరికా (USA): 5.4 మిలియన్లకు పైగా భారతీయులతో అమెరికా అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ టెక్, ఆరోగ్య సంరక్షణ రంగాలలో విపరీతమైన అవకాశాలు, ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలు, నైపుణ్యం కలిగిన నిపుణులకు అనుకూలమైన ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ ఉన్నాయి. న్యూజెర్సీలోని ఎడిసన్, న్యూయార్క్‌లోని జాక్సన్ హైట్స్, కాలిఫోర్నియాలోని ఆర్టీసియా వంటి ప్రాంతాలను “లిటిల్ ఇండియాస్” అని పిలుస్తారు. ఇక్కడ వందలాది భారతీయ రెస్టారెంట్లు, కిరాణా దుకాణాలు, సాంస్కృతిక కేంద్రాలు ఉన్నాయి.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE): 3.57 మిలియన్ల భారతీయులతో యూఏఈ అతిపెద్ద భారత ప్రవాసుల నివాస ప్రాంతంగా ఉంది. నిర్మాణం, ఆతిథ్యం, ఆర్థిక రంగాలలో పన్ను రహిత జీతాలు బ్లూ-కాలర్, వైట్-కాలర్ కార్మికులను ఆకర్షిస్తాయి. దుబాయ్ కార్మిక శక్తిలో 70 శాతానికి పైగా భారతీయులే.

మలేసియా: ఆగ్నేయాసియాలో భారతదేశ రెండవ అతిపెద్ద ప్రవాస జనాభా (2.91 మిలియన్లు) ఇక్కడ ఉంది. 19వ శతాబ్దంలో చక్కెర, రబ్బరు తోటలలో వలసరాజ్యాల కాలం నుంచి ఇక్కడికి వలస వచ్చారు. నేడు, వీరు మలేషియా మొత్తం జనాభాలో 9% ఉన్నారు. మంచి ఉద్యోగాల్లో స్థిరపడి కుటుంబాలను పోషిస్తున్నారు.

కెనడా: కెనడాలో దాదాపు 2.88 మిలియన్ల మంది భారతీయులు నివసిస్తున్నారు. టొరంటో (700,000 మందికి పైగా భారతీయులు), వాంకోవర్ వంటి ప్రధాన నగరాల్లో పంజాబీ మార్కెట్లు, గురుద్వారాలు, బాలీవుడ్ చలనచిత్ర ఉత్సవాలు జరుగుతాయి.

సౌదీ అరేబియా: దాదాపు 2.46 మిలియన్ల మంది భారతీయులు సౌదీ అరేబియాలో పని చేస్తున్నారు. ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. 2023-24లో ఈ సంఖ్య 200,000 పెరిగింది. నిర్మాణం, మౌలిక సదుపాయాలు, సేవల వంటి రంగాలలో డిమాండ్ పెరగడం దీనికి కారణం. 3,000లకు పైగా భారతీయ సంస్థలు ఇప్పుడు సౌదీలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.

యునైటెడ్ కింగ్‌డమ్ (UK): 1.86 మిలియన్ల భారతీయ సంతతి ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. ప్రపంచ యుద్ధం II తర్వాత 1950లలో కార్మికుల కొరత, 1970లలో ఇక్కడ ప్రవాస భారతీయుల సంఖ్య పెరిగింది. 40 శాతానికి పైగా లండన్, లీసెస్టర్, బర్మింగ్‌హామ్ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరు చిన్న వ్యాపారాలు, ఆర్థిక, వైద్య రంగాల్లో స్థానిక ఆర్థిక వ్యవస్థలను నడిపిస్తున్నారు.

దక్షిణాఫ్రికా: దాదాపు 1.7 మిలియన్ల మంది భారతీయులు దక్షిణాఫ్రికాలో ఉన్నారు. వీరు 19వ శతాబ్దంలో చక్కెర తోటలకు తీసుకువచ్చిన కూలీల వారసులు. ఆధునిక వలసదారులలో కేప్‌టౌన్‌లోని ఆంగ్ల మాధ్యమ విద్య, అభివృద్ధి చెందుతున్న ఫిన్‌టెక్ కేంద్రాల వల్ల ఆకర్షితులై అక్కడే ఉండిపోయారు.

శ్రీలంక: 1.61 మిలియన్ల మంది భారతీయులు శ్రీలంకలో నివసిస్తున్నారు. వీరిలో తోటలలో పని చేసే తమిళులు, ఒప్పంద కార్మికులు (టీ, పర్యాటకం, ఐటీ రంగాలలో) ఉన్నారు. ఉమ్మడి తమిళ, సింహళ సాంస్కృతిక చరిత్ర కూడా ఒక దేశం నుండి మరొక దేశానికి సులభంగా మారడానికి సహాయపడుతుంది.

కువైట్: కువైట్‌లో సుమారు 9,95,000 మంది భారతీయులు నివసిస్తున్నారు. ఆదేశ జనాభాలో ఇది 20 శాతానికి పైగా ఉంది. వీరు చమురు క్షేత్రాలు, నిర్మాణం, ఆసుపత్రులు, గృహ రంగాలలో పని చేస్తున్నారు.

ఆస్ట్రేలియా: ఆస్ట్రేలియాలోని 9,76,000 మంది భారతీయులున్నారు. ప్రతి సంవత్సరం 1, 20,000 మందికి పైగా భారతీయ విద్యార్థులు, ప్రధానంగా ఇంజనీరింగ్, ఐటీ రంగ నిపుణులు ఇక్కడ ఎక్కువ

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.