అన్నీ స్కూళ్లకు 10 రోజుల సెలవులు.. ఎప్పుడప్పుడంటే..?

ఈ ఏడాది ఏ నెలలో రానన్ని సెలవులు అక్టోబర్‌లో వచ్చిన విషయం తెలిసిందే. అక్టోబర్‌ నెలలో ఒక్క విద్యార్థులకే కాకుండా బ్యాంకులు, ప్రభుత్వ ఉద్యోగులకు పెద్ద ఎత్తున సెలవులు వచ్చాయి.


ఇక అక్టోబర్‌ ముగిసి నవంబర్‌ నెల వచ్చేసింది. క్యాలెండర్‌లో మరో నెల మారింది. కొత్త నెల అక్టోబర్‌ ప్రారంభమవడంతో మరి ఈ నెలలో ఎన్ని సెలవులు వచ్చాయో తెలుసుకుందాం. ముఖ్యంగా బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలతోపాటు పాఠశాలలు, కళాశాలల సెలవులు తెలుసుకోవాల్సి ఉంది.

నవంబర్‌ -2025 నెలలో పాఠశాలలకు దేశవ్యాప్తంగా భారీ సెలవులు వచ్చాయి. దాదాపుగా పది రోజుల సెలవులు పాఠశాలలకు వస్తున్నాయి. తెలంగాణ, ఏపీతోపాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో జాతీయ సెలవులతోపాటు స్థానిక ఉత్సవాలు, ప్రత్యేక దినాలు, పండుగల నేపథ్యంలో విద్యార్థులకు సెలవులు ఉన్నాయి. నవంబర్‌ నెల ప్రారంభ రోజు అంటే ఒకటో తేదీన చాలా రాష్ట్రాల్లో సెలవు ఉంది. నవంబర్‌ 1వ తేదీన దేశంలో అనేక రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో రాష్ట్ర అవతరణ ఉత్సవం నిర్వహిస్తుండడంతో పాఠశాలలకు సెలవు వచ్చింది. ఇలా నవంబర్‌ నెలలో ఎన్ని సెలవులు వచ్చాయో తెలుసుకుందాం.

నవంబర్ సెలవుల జాబితా
నవంబర్‌ 1వ తేదీ: పలు రాష్ట్రాల్లో రాష్ట్ర అవతరణ దినోత్సవం. ఉమ్మడి ఏపీ ఏర్పడిన రోజు కూడా ఇదే. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం సెలవు ఇవ్వకపోవడం గమనార్హం.
నవంబర్‌ 2: ఆదివారం
నవంబర్ 5: గురునానక్ జయంతి (పంజాబ్‌తోపాటు పలు రాష్ట్రాల్లో సెలవు). కార్తీక పౌర్ణమి సెలవు కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంది.
బాలల దినోత్సవం: నవంబర్ 14 (దాదాపు దేశవ్యాప్తంగా అన్నీ స్కూళ్లకు సెలవు)
గురు తేగ్ బహదూర్ అమరవీరుల దినోత్సవం- నవంబర్ 24 (దేశంలోని కొన్ని ప్రాంతాల్లో సెలవు ఉంటుంది)

రెండో శనివారం- నవంబర్ 8
ఆదివారం- నవంబర్ 9
ఆదివారం- నవంబర్ 16
ఆదివారం- నవంబర్ 23
ఆదివారం- నవంబర్ 30

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.