పదో తరగతి పాసయ్యారా.. మీ కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. మిస్‌ చేసుకోకండి

నేటి కాలంలో ప్రభుత్వ ఉద్యోగమనే కాదు.. ప్రైవేటు జాబ్‌ సాధించాలన్న సరే.. కనీసం డిగ్రీ అర్హతగా నిర్ణయిస్తారు. డిగ్రీ అయినా పూర్తి చేయకపోతే ఉద్యోగాలు సంపాదించడం చాలా కష్టం.


ప్రభుత్వ ఉద్యోగాలకు అయితే డిగ్రీ కచ్చితంగా ఉండాలి. అది రెగ్యులరా.. డిస్టెన్సా అన్న దానితో సంబంధం ఉండదు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో సమస్యలు.. వేరే కారణాల వల్ల కొందరు పదో తరగతితోనే చదువు ఆపేస్తారు. మరి అలాంటి వారు ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలంటే.. అసలు వారికి ఆ అవకాశం ఉందా అంటే.. ఉంది. పదో తరగతి పూర్తి చేసిన వారు కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. ఈ మేరకు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) నోటిఫికేషన్‌ జారీ చేసింది. కేవలం పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకోవచ్చు. ఆ వివరాలు..

పదో తరగతి పాస్‌ అయిన వారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సంపాదించే అవకాశం కల్పిస్తోంది ఎస్‌ఎస్‌సీ. మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌(ఎంటీఎస్‌) భర్తీ కోసం నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. పదో తరగతి పాస్‌ అయిన వారు కూడా ఈ ఉద్యోగాలకు అర్హులు. గ్రూప్‌ సీ, నాన్‌ గెజిటెడ్‌, నాన్‌ మినిస్టీరియల్‌ పోస్టులుగా పిలిచే ఎంటీఎస్‌ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమవుతుంది. ఈ జాబ్‌కి ఎంపికైతే.. ప్రాంరభంలోనే మంచి జీతం పొందవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం మీకోసం..

అర్హత: మెట్రిక్యూలేషన్‌, పదో తరగతి లేదా తత్సమాన తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయసు: కొన్ని పోస్టులకు 18-25, మరికొన్నింటికి 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. ఆయా వర్గాల వారికి వయోపరిమితి సడలింపు ఉంటుంది.
ఫీజు: జనరల్‌, ఓబీసీలకు రూ.100. ఎస్టీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు లేదు.
సెలక్షన్‌ ప్రాసెస్‌: పేపర్‌-1లో పాస్‌ అయితే.. రెండో దశంలో క్వాలిఫైయింగ్‌ టెస్ట్‌ ఉంటుంది. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. పేపర్‌-1లో మెరిట్‌ ఆధారంగా క్యాండేట్స్‌ని సెలక్ట్‌ చేస్తారు. ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తారు. 90 నిమిషాల సమయం. 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ప్రతి తప్పు సమాధానికి 0.25 మార్క్‌ మైనస్‌ చేస్తారు. ఎగ్జామ్‌ పేపర్‌ హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లోనే ఉంటుంది.
అభ్యర్థులు పూర్తి వివరాల కోసం www.ssc.nic.inని సందర్శించాలి.