8 మంది కూర్చునే సౌకర్యం.. 23 కి.మీ మైలేజ్ ఇచ్చే ఈ కారును 12 లక్షల మంది కొన్నారు

యోటా (Toyota) భారతదేశంలో వాహన మార్కెట్‌లో దిగ్గజ బ్రాండ్‌లలో ఒకటి. అంతర్జాతీయంగా తన సత్తాను చాటుతూ, ఇండియాలో కూడా తన హవాను చూపిస్తుంది. ఈ కంపెనీ నుంచి అనేక కార్లు ప్రస్తుతం అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి.


టయోటా ప్రసిద్ధ మోడల్ ఇన్నోవా (Innova) తాజాగా కీలక మైలురాయికి చేరుకుంది. మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 12 లక్షలకు పైగా యూనిట్ల సేల్స్‌ను సాధించింది. ఈ కారు విడుదలైన 2005 సంవత్సరం నుంచి ఇప్పటి దాకా, భారతీయ కుటుంబాల మనసులు గెలుచుకుంటూ వచ్చింది. ఒక MPV (మల్టీ పర్పస్ వెహికల్) అయినా, ఇది సాధారణంగా చూసే కార్ల కన్నా భిన్నంగా నిలుస్తుంది. అందుకే 20 ఏళ్లుగా భారతీయ ప్రజల అభిమానాలను పొందుతుంది.

ఇన్నోవా అంటే నమ్మకంగా, లగ్జరీగా ఉండే ఒక ప్రయాణ అనుభవం. దాని బలమైన డిజైన్, దృఢమైన నిర్మాణం, మృదువైన డ్రైవింగ్ అనుభూతి ఇవన్నీ కలసి దీన్ని మార్కెట్లో ప్రత్యేకంగా నిలబెట్టాయి. పైగా దీని ఇంటీరియర్ లోభాగం కూడా చాలా అందంగా ఉంటుంది, కుటుంబ ప్రయాణాలకు అవసరమైన సౌకర్యాలన్నీ ఇందులో ఉంటాయి. సాధారణంగా దీని ధర ఎక్కువగా ఉంటుంది. అయినా కూడా ప్రజలు ఈ కారును కొనుగోలు చేయడంలో వెనకడుగు వేయలేదు.

2005లో భారత మార్కెట్‌ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఇన్నోవా, ఆ రోజుల్లోనే ఈ కారు లగ్జరీ, బలమైన రూపాన్ని కలగలిపిన వాహనంగా అందరినీ ఆకట్టుకుంది. ఎంత బరువు వేసినా, ఎంత దూర ప్రయాణమైనా, ఇన్నోవా నిరంతరంగా తన బలాన్ని చూపిస్తూ ముందుకు సాగింది. ఇన్నోవా విజయాన్ని కొనసాగిస్తూ, 2016లో టయోటా ఇన్నోవా క్రిస్టా పేరుతో కొత్తదాన్ని తీసుకొచ్చింది. ఇది కూడా ఆధునికత, ఇంటీరియర్‌లో లగ్జరీ, పనితీరులో అందరిని ఆకట్టుకుంది.

ఆ తర్వాత, టయోటా 2022లో, ఇన్నోవా హైక్రాస్ అనే మూడో తరం మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఇది కేవలం డిజైన్ పరంగా కాక, టెక్నాలజీ పరంగానూ గణనీయమైన మార్పులతో వచ్చింది. హైక్రాస్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచిందేమిటంటే, ఇది హైబ్రిడ్ ఇంజిన్‌ను కలిగి ఉండడం. ఇందులో 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉండగా, అదే సమయంలో ఇది హైబ్రిడ్ పవర్‌ట్రైన్‌ను కూడా అందిస్తుంది. ఇది కూడా భారతీయ వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంది.

మరో ఆసక్తికర విశేషం ఏమిటంటే, ఈ ఇన్నోవా హైక్రాస్ నవంబర్ 2024లో ఏకంగా లక్ష మార్కును దాటి కంపెనీకి గొప్ప పేరును తీసుకొచ్చింది. ఈ ఇంజిన్ 173 BHP శక్తి , 209 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగల సామర్థ్యం కలిగి ఉంది. దీని వలన పెట్రోల్-ఇంధన వినియోగంలో తగ్గుదల, మైలేజ్ పెరుగుదల, డ్రైవింగ్ అనుభూతిలో మెరుగుదల కనిపిస్తుంది. దీంతో కారును కొనుగోలు చేసిన కస్టమర్లు పనితీరుతో సంతృప్తి చెందారు.

ప్రస్తుతం భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న టయోటా ఇన్నోవా హైక్రాస్ ధరలు రూ.19.94 లక్షల నుండి రూ.32.58 లక్షల ఎక్స్‌షోరూమ్ వరకు ఉంటూ, వేరియంట్‌ ఆధారంగా విభిన్నంగా ఉన్నాయి. ఈ కారులో 8 మంది ప్రయాణికులు సులభంగా కూర్చోవచ్చు. పెద్ద కుటుంబం కలిగిన వారు ఈ కారును హాయిగా కొనుగోలు చేయవచ్చు. ఇది బలమైన హైబ్రిడ్ వేరియంట్‌లో దాదాపు 23 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇవ్వగలదు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.