దేవరకు ఇవాళ ఒక్కరోజే 137 కోట్ల కలెక్షన్స్- కల్కి కంటే తక్కువే- Jr NTR మూవీపై బాక్సాఫీస్ అంచనా!

www.mannamweb.com


జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా ఇవాళ (సెప్టెంబర్ 27) విడుదలైంది. విభిన్నంగా దేవర రివ్యూలు ఉంటున్నాయి. అయితే, ఈ నేపథ్యంలో దేవర బాక్సాఫీస్ కలెక్షన్స్ మొదటి రోజు ఎంత ఉండొచ్చని అంచనా వేశారు ట్రేడ్ నిపుణులు. దేవర ఫస్ట్ డే ఎక్స్‌పెక్టెండ్ కలెక్షన్స్ ఇవే!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ హై ఓల్టేజ్ యాక్షన్ చిత్రం దేవర: పార్ట్ 1 శుక్రవారం (సెప్టెంబర్ 27) ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్‌గా విడుదలైంది. తారక్, జాన్వీ కపూర్ తొలిసారిగా జంటగా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే.

మిక్స్‌డ్ టాక్

అయితే, దేవర సినిమాకు పలు భిన్నమైన రివ్యూలు వస్తున్నాయి. దేవర మూవీపై మిక్స్‌డ్ టాక్ వినిపిస్తోంది. కానీ, ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ 20 నిమిషాలు, యాక్షన్ ఎపిసోడ్స్ అదిరిపోయాయని నెటిజన్స్ ట్విట్టర్‌ ద్వారా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దేవర మొదటి రోజు కలెక్షన్స్‌పై క్యూరియాసిటీ నెలకొంది.

దేవర సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఓపెనింగ్‌ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్‌లో దేవర సినిమాకు అదిరిపోయే స్పందన వచ్చింది. అయితే, దేవర సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు దాదాపు రూ. 130 నుంచి రూ. 137 కోట్ల గ్రాస్ వసూలు చేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
75 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్

అయితే, ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీ వరల్డ్ వైడ్‌గా తొలి రోజున రూ. 177.70 కోట్లు వసూలు చేసింది. కల్కి కంటే తక్కువగానే దేవర ఓపెనింగ్ కలెక్షన్స్ సాధిస్తుందని తెలుస్తోంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన దేవర మూవీకి ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 75 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు అయ్యాయట.

అలాగే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో దేవర చిత్రానికి రూ. 65-70 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమా ఓవరాల్‌‌గా ఇండియా బాక్సాఫీస్ వద్ద తొలిరోజు రూ. 85-90 కోట్ల మధ్య ఉండవచ్చని చెబుతున్నారు. ప్రీమియర్ అమ్మకాలతో సహా ఓవర్సీస్ మార్కెట్‌లో దేవర సినిమాకు తొలిరోజున రూ. 40 కోట్ల (5 మిలియన్ డాలర్లు) టిక్కెట్లు అమ్ముడయ్యాయని సమాచారం.
కర్ణాటకలో దేవర కలెక్షన్స్

అలాగే, వరల్డ్ వైడ్‌గా దేవర అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ. 75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందట. ఇదిలా ఉంటే, దేశీయ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణా వంటి రాష్ట్రాలలో స్టార్ ప్రీ-సేల్స్ సాధించింది. దేవర: పార్ట్ 1కు ఆంధ్రప్రదేశ్‌లో రూ. 16.31 కోట్ల టిక్కెట్‌ విక్రయాలు జరగగా, కర్ణాటకలో రూ. 5.85 కోట్ల టిక్కెట్లు అమ్ముడయ్యాయి.

అలాగే, తెలంగాణలో 12.88 కోట్ల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఇదిలా ఉంటే, ప్రభాస్, దీపికా పదుకొణె నటించిన కల్కి 2898 ఏడీ తర్వాత ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లను సాధించిన రెండవ భారతీయ చిత్రంగా దేవర అవతరించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయనం చేసిన దేవర పార్ట్ 1లో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా.. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా చేశాడు. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఆచార్య తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహించిన సినిమా ఇది.