యూనియన్ బ్యాంక్ లో 1500 జాబ్స్.. నెలకు 48 వేల జీతం.. ఈ అర్హతలుంటే చాలు

www.mannamweb.com


బ్యాంకింగ్ సెక్టార్ లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారా? బ్యాంక్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారా? ఏళ్లుగా బ్యాంక్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా? బ్యాంక్ జాబ్ సాధించడమే మీ లక్ష్యమా? జాబ్ దొరకడం లేదని వర్రీ అవుతున్నారా? జాబ్ కోసం సెర్చ్ చేసి విసిగిపోయారా? ఇక మీరు రిలాక్స్ అవ్వొచ్చు. మీ డ్రీమ్ ను ఫుల్ ఫిల్ చేసుకునే ఛాన్స్ వచ్చింది. యూనియన్ బ్యాక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. భారీగా ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగాలను సాధించి లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు. మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ఖాళీగా ఉన్నట్లైతే ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి. మీకోసం బ్యాంక్ జాబ్స్ సిద్ధంగా ఉన్నాయి.

యూనియన్ బ్యాంక్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 1500 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మొత్తం పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌లో 200 పోస్టులు.. తెలంగాణలో 200 పోస్టులు భర్తీకానున్నాయి. ఈ పోస్టులకు పోటీ పడే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ/విద్యా సంస్థ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే స్థానిక భాషపై పట్టు కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3ఏళ్లు, పీడబ్య్లూబీడీలకు 10 ఏళ్లు, ఎక్స్ సర్వీస్ మెన్స్ కు 5 ఏళ్లు వయోసడలింపు వర్తిస్తుంది. ఈ పోస్టులకు రాత పరీక్ష/ గ్రూప్‌ డిస్కషన్‌/ పర్సనల్‌ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల పాటు ప్రొబేషన్‌ పీరియడ్‌ ఉంటుంది. ఈ జాబ్స్ కు ఎంపికైన వారికి నెలకు రూ.48 వేల 480 నుంచి రూ.85 వేల 920 వరకు ఉంటుంది. దరఖాస్తు ఫీజు జనరల్‌, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్యర్థులు రూ.850 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.175 (జీఎస్టీతో కలిపి) చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ప్రక్రియ అక్టోబర్ 24 నుంచి ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు నవంబర్ 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లై చేసుకోదలిచిన అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం యూఐబీ అధికారిక వెబ్ సైట్ www.unionbankofindia.co.in ను సందర్శించాల్సి ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే అప్లై చేసుకోండి.