తిరుమలలో భక్తుల రద్దీ.. ద‌ర్శ‌నానికి 18 గంటల స‌మ‌యం..

www.mannamweb.com


ఇక తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం ఉదయం స్వామివారిని చిన్నశేష వాహనంపై మాడవీధుల్లో ఊరేగించారు. మురళీకృష్ణుడి అవతారంలో శ్రీనివాసుడు భక్తులకు అభయప్రదానం చేశారు.

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు శనివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండి వెలుపల క్యూలైన్‌లో భక్తులు వేచివున్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక శుక్రవారం శ్రీవారిని మొత్తం 54వేల 866 మంది దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 2 కోట్ల 60లక్షల రూపాయలు వచ్చింది.

ఇక తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం ఉదయం స్వామివారిని చిన్నశేష వాహనంపై మాడవీధుల్లో ఊరేగించారు. మురళీకృష్ణుడి అవతారంలో శ్రీనివాసుడు భక్తులకు అభయప్రదానం చేశారు. 10 గంటల వరకు చిన్నశేష వాహనసేవ నిర్వహించారు. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హంస వాహనసేవ జరగనుంది.