జియో నుంచి 2 కొత్త ప్లాన్‌లు.. ప్రత్యేక బెనిఫిట్లు.

మొబైల్ గేమర్లకు శుభవార్త.. గేమింగ్ ఔత్సాహికుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన రెండు కొత్త అపరిమిత 5జీ డేటా ప్లాన్లను రిలయన్స్ జియో లాంచ్ చేసింది. ఈ కొత్త ప్లాన్లు హై-స్పీడ్ డేటాను మాత్రమే కాకుండా ఉచిత బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (బీజీఎంఐ) స్కిన్లు, జియోగేమ్స్ క్లౌడ్‌ యాక్సెస్‌ వంటి గేమింగ్ ప్రయోజనాలను కూడా అందిస్తాయి.  వినియోగదారులు వాటిని డౌన్లోడ్ చేయకుండానే 500కి పైగా ప్రీమియం గేమ్‌లను ఆడుకోవచ్చు.


  • ప్లాన్ వివరాలు.. ప్రయోజనాలు
    జియో ప్రారంభించిన కొత్త ప్లాన్‌లు.. ఒకటి రూ.495 ప్లాన్‌, మరొకటి రూ.545 ప్లాన్‌. ఈ రెండు ప్లాన్లూ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తాయి. రూ.495 ప్లాన్లో రోజుకు 1.5 జీబీ డేటా, అదనంగా 5 జీబీ బోనస్ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, జియోగేమ్స్ క్లౌడ్ యాక్సెస్ లభిస్తుంది. రూ.545 ప్లాన్లో రోజుకు 2 జీబీ 4జీ డేటా, అన్లిమిటెడ్ 5జీ డేటాతో పాటు అదే గేమింగ్ బెనిఫిట్స్ లభిస్తాయి.

  • రెండు ప్లాన్లలో బార్డ్స్ జర్నీ సెట్, డెసర్ట్ టాస్క్ ఫోర్స్ మాస్క్, ట్యాప్ బూమ్ మొలోటోవ్ కాక్టెయిల్ వంటి ప్లేయర్లకు ఉచిత ఇన్-గేమ్ వస్తువులను అందించే ప్రత్యేక బీజీఎంఐ రివార్డ్ కూపన్లు కూడా ఉన్నాయి. ఈ రివార్డులను క్లెయిమ్ చేసుకోవడానికి వినియోగదారులు గేమింగ్ ప్యాక్‌లలో దేనితోనైనా రీఛార్జ్ చేసుకోవచ్చు. రీఛార్జ్ చేసిన తర్వాత, ధృవీకరణ సందేశం వస్తుంది. మై జియో యాప్‌లో రివార్డ్ కూపన్లు లభిస్తాయి. ప్లేయర్ క్యారెక్టర్ ఐడీ, ఇచ్చిన యూనిక్ కోడ్ ఉపయోగించి ఈ కూపన్లను అధికారిక బీజీఎంఐ వెబ్సైట్లో రీడీమ్ చేసుకోవచ్చు.

  • ఇక జియోగేమ్స్ క్లౌడ్ వినియోగదారులు హై-ఎండ్ పరికరాలు అవసరం లేకుండా నేరుగా వారి స్మార్ట్‌ఫోన్లు, టీవీలు లేదా బ్రౌజర్లలో గేమ్స్ ఆడవచ్చు.ఈ సేవను పొందడానికి వినియోగదారులు జియోగేమ్స్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి, వారి జియో నంబర్‌తో లాగిన్ కావాలి. సబ్ స్క్రిప్షన్ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.