దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే రీజియన్నలో ఖాళీగా ఉన్న 22 వేలకుపైగా లెవల్ 1 (గ్రూప్ డి) ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) నోటిపికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ కింద ట్రాక్ మెయింటైనర్ (గ్రేడ్ 4), పాయింట్స్‌మెన్, బ్రిడ్జ్, ట్రాక్ మెషీన్, లోకో షెడ్, ఎస్ అండ్ టీ వంటి తదితర విభాగాల్లో అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. పదో తరగతి లేదా ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థులు ఎవరైనా జనవరి 21, 2026వ తేదీ నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతి లేదా సంబంధిత విభాగంలో ఐటీఐలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి జనవరి 1, 2026వ తేదీ నాటికి 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ అర్హతలు ఉన్నవారు ఫిబ్రవరి 20వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అభ్యర్థులకు సంబంధించిన ఆధార్ కార్డు వివరాలను దరఖాస్తు సమయంలో తప్పనిసరిగా ఉపయోగించాలి. ఆధార్‌లోని పేరు, పుట్టిన తేదీ, ఫొటో 10వ తరగతి సర్టిఫికేట్‌తో సరిపోలాలి. ఈ ఏడాది నుంచి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో పారదర్శకత కోసం ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి చేసింది. కాబట్టి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం నాటికి అభ్యర్దులు తమ ఆధార్ కార్డులోని వివరాలను చేసుకోవాలని ఆర్‌ఆర్‌బీ సూచించింది.
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.18 వేల నుంచి బేసిక్ జీతంతోపాటు ఇతర రైల్వే అలవెన్సులు చెల్లిస్తారు. కాగా ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తి విద్యార్హతలు, ఎంపిక విధానం, అప్లికేషన్ ఫీజు వంటి ఇతర వివరాలు త్వరలోనే విడుదలయ్యే వివరణాత్మక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు. ఇతర వివరాలు అధికారిక వెబ్‌సైట్ లో చెక్ చేసుకోవచ్చు.


































