రైల్వే ప్రయాణికులు అదిరిపోయే న్యూస్.. దసరా, దీపావళికి 24 ప్రత్యేక రైళ్లు

www.mannamweb.com


మన దేశంలోని అనేక ప్రభుత్వ వ్యవస్థలో రైల్వే శాఖ అతి ముఖ్యమైనది. దీని ద్వారా నిత్యం వేలాది మంది తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు. టికెట్ ధర తక్కువగా ఉండటంతో రైళ్లలో ప్రయాణించేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు రైళ్లలోనే ప్రయాణించేందుకు ఇష్టపడుతుంటారు. ఇక పండగలు, ఇతర ప్రత్యేక పర్వదినాల సందర్భాల్లో రైళ్లు కిక్కిరిసిపోయి ఉంటాయి. రైల్వేశాఖ కూడా ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే వారికి తరచూ ఏదో ఒక గుడ్ న్యూస్ చెబుతుంది. తాజాగా సొంత ఊర్లకు వెళ్లే వారికి రైల్వే శాఖ ఓ అదిరిపోయే న్యూస్ చెప్పింది. 24 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తూ.. రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

చాలా మంది జీవనోపాధి కోసం సొంత ఊరు వదిలి నగరాలకు వచ్చి జీవనం సాగిస్తుంటారు. నేటికాలంలో అలా పట్టణాలకు వలసలు వెళ్లేవారి సంఖ్య బాగా పెరిగింది. సొంతవారిని వదిలి నగరాల్లో జీవిస్తూ.. ఏదో ప్రత్యేకమైన సందర్భాల్లో, పండగల సమయాల్లో మాత్రమే ఊర్లకి వెళ్తుంటారు. ఇలా పండగల సమయంలో సొంత ఊర్లకి వెళ్లేటప్పుడు ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆ సమయంలో సొంత ఊరికి వెళ్లేందుకు ప్రజలు అధిక రేట్లను వెచ్చించి మరి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దసరా, దీపావళి, సంక్రాంతి ఇలా కొన్ని పండుగలకు బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికుల రద్దీతో కిక్కిరిసిపోయి ఉంటాయి.

ఈ క్రమంలోనే ఏటా ప్రత్యేక రైళ్లను, ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తుంటారు. అలానే ఈ సారి కూడా దక్షిణ మధ్య రైల్వే రాబోయే దసరా, దీపావళి పండుగకు కొన్ని ప్రత్యేక రైలు సర్వీసులను నడుపుతున్నట్లు వెల్లడించింది. పండగలకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని 24 ప్రత్యేక రైలు సర్వీసులను తీసుక వచ్చింది. అక్టోబరు 5 నుంచి నవంబరు 12 మధ్య ఒక్కోక మార్గంలో 6 ట్రిప్పుల చొప్పున ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ 24 రైళ్లను అందుబాటులో ఉంచబోతున్నట్లు జోన్‌ సీపీఆర్వో ఎ.శ్రీధర్‌ తెలిపారు. ఈ 24 రైళ్లలో సికింద్రాబాద్‌ – తిరుపతి రైలు అక్టోబరు 5 నుంచి నవంబరు 9 వరకు ప్రతి శనివారం నడవనుంది. అదే విధంగా తిరుపతి – సికింద్రాబాద్‌ ట్రైన్ కూడా అక్టోబరు 8 నుంచి నవంబరు 12 వరకు ప్రతి మంగళవారం తిరగనుంది.

తిరుపతి – శ్రీకాకుళం రోడ్‌ రైలు అక్టోబరు 6 నుంచి నవంబరు 10 వరకు ప్రతి ఆదివారం నడనుంది. అదే విధంగా శ్రీకాకుళం రోడ్‌ నుంచి తిరుపతి వరకు వెళ్లే రైలు అక్టోబరు 7 నుంచి నవంబరు 11 వరకు ప్రతి సోమవారం తిరగనుంది. అలానే మరికొన్ని ట్రైన్లు కూడా ఆయా మార్గాల్లో ప్రయాణించనున్నాయి. మొత్తంగా త్వరలో రానున్న దసరా, దీపావళీ పండగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణికులుక ఈ శుభవార్త అందించింది.