జనవరి 1 నుంచి మారనున్న 25 రూల్స్ ఇవే.. కచ్చితంగా తెలుసుకోవాల్సినవి

www.mannamweb.com


ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా మళ్లీ జనవరి 1 వచ్చేసింది. అయితే ప్రతి నెల మారినట్లుగానే ఈ నెల కూడా కొన్ని రూల్స్ మారబోతున్నాయి. ఇక కొత్త సంవత్సరం కనుక చాలా వరకు రూల్స్‌ను మారుస్తున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ప్రయివేటు రంగానికి చెందిన నియమాలను కూడా మారుస్తున్నారు. ముఖ్యంగా 25 రూల్స్ విషయంలో మాత్రం మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇక మారనున్న ఆ రూల్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. జనవరి 1 నుంచి రైతులకు అందించే పంట రుణం పరిమితి రూ.1.60 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెరగనుంది. రూ.2 లక్షల వరకు ఉచితంగా రుణం పొందవచ్చు.

2. బ్యాంకింగ్ పనిగంటలు మారనున్నాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బ్యాంకులు పనిచేస్తాయి.

3. ఇకపై రేషన్ కార్డు హోల్డర్లు కార్డులను ఉపయోగించుకోవాలంటే కచ్చితంగా ఎప్పటికప్పుడు ఈ-కేవైసీ చేయించుకోవాలి.

4. క్రెడిట్ కార్డుల బిల్లులను సకాలంలో చెల్లించకపోతే అధిక మొత్తంలో వడ్డీ వేస్తారు. 30 శాతం నుంచి 50 శాతానికి వడ్డీ రేటును పెంచనున్నారు.

5. పాత కార్లను విక్రయిస్తే 18 శాతం జీఎస్‌టీ వసూలు చేస్తారు.

6. అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ రుసుములో మార్పులు చోటు చేసుకోనున్నాయి.

7. దివ్యాంగులకు, ఒంటరి మహిళలకు ఇచ్చే పెన్షన్లను ఇకపై ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తారు.

8. థియేటర్లలో, మాల్స్‌లో పాప్ కార్న్‌పై వసూలు చేస్తున్న జీఎస్టీని 18 శాతానికి పెంచనున్నారు.

9. ఇకపై ఆధార్ కార్డును పాన్‌ను అనుసంధానించడం తప్పనిసరి.

10. కొన్ని రకాల వస్తువులు, సేవలకు సంబంధించి జీఎస్‌టీ శ్లాబ్స్ మారనున్నాయి.

11. జనవరి 1, 2025 నుంచి కొత్త పెన్షన్ స్కీమ్‌ను అందుబాటులోకి తేనున్నారు.

12. ఆన్‌లైన్ షాపింగ్ డెలివరీలపై 18 శాతం జీఎస్‌టీని వసూలు చేయనున్నారు.

13. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకు గాను ఆన్‌లైన్ సేవలను విస్తృతం చేస్తారు. భౌతిక బ్యాంకులను తగ్గిస్తారు.

14. డిజిటల్ ఎడ్యుకేషన్‌కు గాను నూతన నియమ నిబంధనలను అమలులోకి తేనున్నారు.

15. స్కాలర్‌షిప్‌, ఫెలోషిప్‌కు సంబంధించి రూల్స్‌ను మార్చనున్నారు.

16. స్టాక్ మార్కెట్‌కు సంబంధించి ట్రాన్సాక్షన్ల ఫీజు, ఇతర వివరాలను మార్చనున్నారు.

17. ఎలక్ట్రికల్ బిల్స్‌ను ఆన్‌లైన్‌లో మరింత సులభంగా చెల్లించేందుకు నూతన విధానాలను అమలు చేయనున్నారు.

18. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు కొత్త పథకాలకు శ్రీకారం చుట్టనున్నారు.

19. ప్రకృతి విపత్తుల ద్వారా నష్టపోయిన వారికి పరిహారం చెల్లించేందుకు నూతన ఇన్సూరెన్స్ పథకాలను అందుబాటులోకి తేనున్నారు.

20. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వారు అదనపు పత్రాలను సమర్పించాల్సి రావచ్చు.

21. అంతర్జాతీయ ప్రయాణాలు చేసే వారికి నూతన వీసా, పాస్‌పోర్ట్ రూల్స్‌ను అమలు చేయనున్నారు.

22. కొత్తగా స్మార్ట్ సిటీ స్కీమ్ ను అందుబాటులోకి తెచ్చి నగరాలను అభివృద్ధి చేస్తారు.

23. పెట్రోల్‌, డీజిల్ ధరల్లో మార్పులు రానున్నాయి.

24. హెల్త్ ఇన్సూరెన్స్ ను మరింత మంది ఉపయోగించుకునేందుకు గాను నూతన నియమాలను అమలు చేయనున్నారు.

25. కొత్తగా ఇండ్లను కొనేవారు లేదా కట్టించుకునే వారి కోసం నూతన హౌసింగ్ స్కీమ్‌లను ప్రవేశపెట్టనున్నారు.