ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో కొత్త ఇల్లు నిర్మించుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం నాడు నూతన గృహప్రవేశ కార్యక్రమం జరిగింది.
ఈ వేడుకలో పాల్గొనడం కోసం సుమారు పాతికవేల మందికి ఆహ్వానాలు అందాయి. కార్యక్రమంలో పాల్గొనే వారి కోసం చంద్రబాబు రుచికరమైన వంటకాలతో విందు ఏర్పాటు చేయించనున్నారు. మెనూ చూస్తే మతి పోయేలా ఉంది. ఆ వివరాలు మీకోసం..ఏపీ ముఖ్యంమంత్రి చంద్రబాబు నాయుడు.. కుప్పం నియోజకవర్గం, శాంతిపురం మండలం, కడపల్లె పంచాయతీ పరిధిలోని శివపురంవద్ద రెండెకరాల స్థలంలో కొత్త ఇంటిని నిర్మించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన భార్య నారా భువనేశ్వరితో కలిసి ఆదివారం తెల్లవారుజామున 3-4 గంటల మధ్య ప్రాంతంలో కుటుంబ సమేతంగా నూతన గృహప్రవేశం చేశారు. చంద్రబాబు నాయుడు.. ఎంతో ఘనంగా గృహ ప్రవేశ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా సుమారు 25 వేలమందికి భోజనాల ఏర్పాట్లు చేశారు. ఆదివారం మధ్యాహ్నం విందు ఇవ్వనున్నారు. ఇందుకోసం వీవీఐపీ, వీఐపీ, సాధారణ గ్యాలరీలను ఇప్పటికే ఏర్పాటు చేశారు. నూతన గృహ ప్రవేశ వేడుక సందర్భంగా సుమారు 25 వేలమంది సాధారణ ప్రజలకు, 2 వేలమంది వీఐపీలకు భోజనాలు సిద్ధం చేస్తున్నారు.చంద్రబాబు ముఖ్యమంత్రి మాత్రమే కాక.. స్థానిక ఎమ్మెల్యే కూడా కావడంతో.. నియోజకవర్గంలోని ప్రతి కుటుంబ నుంచి కనీసం ఒక్కరైనా గృహప్రవేశానికి హాజరయ్యి.. భోజనం చేసి వెళ్లేలా చూడాలని టీడీపీ శ్రేణులకు సూచించారు. దీంతో సోషల్ మీడియా వేదికగా డిజిటల్ ఆహ్వాన పత్రికలు పెట్టడంతోపాటు, పార్టీ నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి వెళ్లి గృహప్రవేశ ఆహ్వాన పత్రికలను పంచి ప్రజలను ఆహ్వానించారు. అలానే ఈ వేడుక కోసం టీడీపీ కార్యకర్తలు, నాయకులకు సైతం ప్రత్యేక ఆహ్వానాలు అందాయి.
విందు మెనూ
- సంప్రదాయ వంటలు: చక్కెర పొంగలి, జిలేబీ, తాపేశ్వరం కాజా
- స్నాక్స్: సమోసా
- రైస్: టమోటా రైస్, వెజ్ బిరియాని, రైతా
- కూరలు: మామిడన్నం, మఫ్రూమ్ గుజ్జు కూర, బెండకాయ ఫ్రై, గుత్తివంకాయ మసాలా, మష్‌రూమ్ గుజ్జు కూర, వడపులు, ఆలూ ఫ్రై
- ఇతర వంటలు: వైట్ రైస్, ఘీరైస్, రసం, సాంబార్, గోంగూర పచ్చడి, అప్పడం, పెరుగుతో పాటుగా ఆవకాయ కూడా
- స్వీట్: క్యారెట్ హల్వాతో పాటుగా ఐస్‌క్రీమ్
- తాంబూలం: మీఠా పాన్
































