ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో అదనంగా 250 ఎంబీబీఎస్‌ సీట్లు

ప్రస్తుత విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని పలు ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో అదనంగా 250 ఎంబీబీఎస్‌ సీట్లకు జాతీయ వైద్య కమిషన్‌ కొత్తగా అనుమతులు ఇచ్చింది. ఈ నెల 13న పుత్తూరు అన్నా గౌరి వైద్య కళాశాలలో 100 సీట్లను 150కు పెంచగా.. కర్నూలు శాంతిరామ్‌ వైద్య కళాశాలలో 150 సీట్లను 200కు పెంచింది. తాజాగా గురువారం విశాఖపట్నం ఎన్నారై వైద్య కళాశాలలో ఉన్న 150 ఎంబీబీఎస్‌ సీట్లను 250కి పెంచుతూ అనుమతులు ఇచ్చింది. అలాగే కర్నూలు శాంతిరామ్‌ వైద్య కళాశాలలో ఇప్పటికే 200కు పెంచిన సీట్లను మళ్లీ 250కి పెంచింది. పెరిగిన ఈ సీట్లకు లెటర్‌ ఆఫ్‌ పర్మిషన్‌(ఎల్‌ఓపీ) రావాల్సి ఉంది. మూడో విడత కౌన్సెలింగ్‌లో వీటిని భర్తీ చేయనున్నట్లు విజయవాడ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేర్కొంది.


👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.