కోమకి రేంజర్ ఎలక్ట్రిక్ క్రూయిజర్ బైక్.. సింగిల్ ఛార్జ్‌తో 250 కి.మీ.!

www.mannamweb.com


క్రూయిజర్ బైక్స్ ని ఇష్టపడేవారు చాలా మంది ఉంటారు. చూడ్డానికి చాలా స్టైలిష్ గా ఉంటాయి. రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350, హొండా సీబీ 350, ట్రయంఫ్ స్పీడ్ 400, టీవీఎస్ రోనిన్, బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 160 ఇలా మార్కెట్లో అనేక కంపెనీలకు చెందిన క్రూయిజర్ బైక్స్ అందుబాటులో ఉన్నాయి. ఆగస్టు 15న బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 బైక్ కూడా రిలీజ్ అయ్యింది. అయితే బైక్స్ ని ఇష్టపడేవారు ఉన్నా కూడా గేర్లు అనేసరికి వెనక్కి తగ్గుతారు. అంత కంఫర్ట్ ఉండదు కదా అని అలోచించి వెనకడుగువేసేవారు ఉంటారు. గేర్లు లేని బైక్ వస్తే బాగుణ్ణు అనుకునేవారికి ఎలక్ట్రిక్ బైక్స్ ఉత్తమమైన ఛాయిస్ అని చెప్పవచ్చు. అందులోనూ క్రూయిజర్ ఎలక్ట్రిక్ బైక్ వస్తుందంటే అంతకంటే హ్యాపీనెస్ ఇంకేముంటుంది చెప్పండి. కోమకి కంపెనీ క్రూయిజర్ బైక్ ని ఇండియాలో లాంఛ్ చేసింది. ఇది దేశంలోనే ఫస్ట్ ఎలక్ట్రిక్ క్రూయిజర్ బైక్.

కోమకి రేంజర్ ఎలక్ట్రిక్ క్రూయిజర్ బైక్.. ఇది సింగిల్ ఛార్జ్ తో 200 నుంచి 250 కి.మీ. ప్రయాణిస్తుంది. దీని టాప్ స్పీడ్ 70 నుంచి 80 కి.మీ.గా ఉంది. నాలుగు గంటల్లో 0 నుంచి 90 శాతం ఛార్జింగ్ అనేది ఎక్కేస్తుంది. ఈ బండి అడ్వాన్స్డ్ లిథియం బ్యాటరీతో వస్తుంది. ఇది 4 కిలోవాట్ బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. బ్యాక్ రెస్ట్ తో పాటు కంఫర్టబుల్ సీటింగ్, 50 లీటర్ల అడిషనల్ స్టోరేజ్, ఎల్ఈడీ హెడ్ లాంప్ తో పాటు అడిషనల్ హెడ్ లాంప్ వంటివి ఉన్నాయి. బైక్ లవర్స్ మెచ్చే డ్యూయల్ సౌండ్ పైప్స్ కూడా ఉన్నాయి. అది కూడా ఫ్లేమ్ ఎఫెక్ట్ తో పాటు వస్తాయి. బైక్ సౌండ్ ని ఫీల్ అయ్యేవారి కోసం ఇచ్చారు. చాలా స్టైలిష్ లుక్ తో వస్తుంది. ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే బ్యాక్ సైడ్ అడ్జస్టబుల్ రేర్ సస్పెన్షన్, ఫ్రంట్ సైడ్ సుపీరియర్ టెలీస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు.

ఆటో రిపేర్ స్విచ్, క్రూయిజ్ కంట్రోల్, పార్క్ అసిస్టెంట్ ఫీచర్స్ ఉన్నాయి. డ్యూయల్ ప్యాసెంజర్ ఫుట్ రెస్ట్, రేర్ టెయిల్ లాంప్, రేర్ బ్యాక్ రెస్ట్ తో పాటు మొబైల్ ఛార్జింగ్ యూనిట్, టర్బో మోడ్ ఫీచర్స్ ఉన్నాయి. ఫ్రంట్ బాడీ గార్డ్, రేర్ ప్రొటెక్షన్ గార్డ్, సైడ్ స్టాండ్ సెన్సార్ వంటివి కూడా ఉన్నాయి. ఇంకో విశేషం ఏంటంటే.. ఈ బైక్ లో బ్లూటూత్ కనెక్టివిటీతో సౌండ్ సిస్టంని కూడా ఇచ్చారు. లాంగ్ డ్రైవ్ చేసేవారు మ్యూజిక్ వింటూ వెళ్ళచ్చు. దీన్ని ఫోన్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. అలానే మొబైల్ యాప్ ద్వారా ఈ బైక్ ని కనెక్ట్ చేసుకుని హెల్త్ స్టేటస్, బ్యాటరీ స్టేటస్, ఛార్జింగ్ వంటివి చూసుకోవచ్చు. ఓడోమీటర్ ప్రొటెక్షన్ గార్డు, ఫ్రంట్ విండ్ షీల్డ్ కూడా ఇస్తున్నారు. గేర్ మోడ్, రివర్స్ స్విచ్ ఫీచర్స్ ఉన్నాయి. ఇది జెట్ బ్లాక్ కలర్ లో అందుబాటులో ఉంది. దీని ఎక్స్ షోరూం ధర రూ. 1,85,505గా ఉంది. ఆన్ లైన్ లో కూడా బుక్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో రూ. 1,99,649 అందుబాటులో ఉంది.