రెవెన్యూ శాఖ‌లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు, 40 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల

www.mannamweb.com


రాష్ట్రంలో రెవెన్యూ శాఖ‌లో కాంట్రాక్ట్ ప‌ద్ద‌తిలో 40 పోస్టుల భ‌ర్తీకి ఏపీ ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగానే విశాఖ‌ప‌ట్నంలో పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయింది. ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసేందుకు న‌వంబ‌ర్ 4 ఆఖ‌రు తేదీగా నిర్ణ‌యించారు.

ఏపీ రెవెన్యూ శాఖ‌లో కాంట్రాక్ట్ ప‌ద్ద‌తిలో 40 పోస్టుల భ‌ర్తీకి ఏపీ ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగానే విశాఖ‌ప‌ట్నంలో పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయింది. ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసేందుకు న‌వంబ‌ర్ 4 ఆఖ‌రు తేదీగా నిర్ణ‌యించారు.

రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, భూప‌రిపాల‌న ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ 40 పోస్టులు భ‌ర్తీ చేసేందుకు ఆదేశించారు. అందులో ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్లు-13 కాగా, ఈ-డివిజనల్ మేనేజర్లు-27 ఉన్నాయి. కాంట్రాక్టు ప్రాతిపదికన కొత్తగా ఏర్ప‌డిన‌ రెవెన్యూ డివిజన్లకు ఆ పోస్టుల‌ను కేటాయించారు. ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్లు, ఈ-డివిజనల్ మేనేజర్లు సంబంధిత జిల్లా కలెక్టర్ నియంత్రణలో, రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నియంత్రణలో ఉంటారు. ఈ-డిస్ట్రిక్ట్ మిషన్ మోడ్ ప్రాజెక్ట్ అమ‌లు కోసం, దానివల్ల ఉత్పన్నమయ్యే సాంకేతిక సమస్యల పరిష్కారం వీరు ప‌ని చేస్తార‌ని పేర్కొంది.

ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్లు, ఈ-డివిజనల్ మేనేజర్లు పోస్టుల‌ను డిస్ట్రిక్ట్‌ క‌మిటీ ప్ర‌తిపాద‌న మేర‌కు క‌లెక్ట‌ర్ అపాయింట్ చేస్తారు. డిస్ట్రిక్ట్ క‌మిటీకి క‌లెక్ట‌ర్ చైర్మ‌న్‌గా, జాయింట్ కలెక్ట‌ర్‌, డిస్ట్రిక్ట్ ఇన్‌ఫ‌ర్మేష‌న్ ఆఫీస‌ర్ స‌భ్యులుగా ఉంటాయి.

అందులో భాగంగానే విశాఖ‌ప‌ట్నం క‌లెక్ట‌ర్ కార్యాల‌యం ఈ-డివిజ‌నల్ మేనేజ‌ర్ పోస్టుల భ‌ర్తీ కోసం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. విశాఖ జిల్లాలోని కొత్త‌గా ఏర్ప‌డిన భీమునిప‌ట్నం రెవెన్యూ డివిజ‌న్‌లో ఈ-డివిజ‌న‌ల్ మేనేజ‌ర్ (టెక్నిక‌ల్ అసిస్టెంట్ కేట‌గిరీ) పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది.
నెల‌వారీ జీతం…వ‌యో ప‌రిమితి

ఈ పోస్టుకు నెల‌వారీ వేత‌నం రూ.22,500 ఉంటుంది. 2022 జూలై 1 నాటికి 21 నుంచి 35 మ‌ధ్య వ‌య‌స్సు ఉండాలి.
విద్యార్హ‌త

ద‌రఖాస్తు చేయాల‌నుకునే అభ్య‌ర్థులు గ్రాడ్యూష‌న్ (బీసీఏ, బీఎస్సీ, బీటెక్), మాస్ట‌ర్ డిగ్రీని పూర్తి చేయాల్సి ఉంటుంది. మంచి ఇంగ్లీష్ క‌మ్యూనికేష‌న్ నైపుణ్యం క‌లిగి ఉండాలి. అభ్య‌ర్థి విద్యార్హ‌త ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల‌ను ఏదైనా గెజిటెడ్ అధికారి ద్వారా ధ్రువీక‌రించాలి.
ఎంపిక ప్ర‌క్రియ

రాత ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. రాత ప‌రీక్ష అర్హ‌త సాధించిన త‌రువాత, డిస్ట్రిక్ క‌మిటీ ఇంటర్వ్యూ నిర్వ‌హిస్తుంది. ఐటీ సెక్ట‌ర్‌లో క‌నీసం రెండేళ్ల‌ అనుభవం ఉండే స‌ర్టిఫికేట్ ఉంటే, ఇంట‌ర్వ్యూ స‌మ‌యంలో 5 శాతం వెయిటేజ్ ఇస్తారు. డిస్ట్రిక్ట్ క‌మిటీ రిజ‌ర్వేష‌న్ల‌ను అమ‌లు చేస్తుంది. ఈ ఉద్యోగ ప‌ద‌వీకాలం జాయిన్ అయిన రోజు నుంచి ఏడాది పాటు ఉంటుంది. ప్ర‌భుత్వ సూచన‌, అలాగే ఉద్యోగి ప‌నితీరును బ‌ట్టీ పొడిగించ‌వచ్చు. అలాగే త‌ప్పుడు స‌మాచారం పొందుప‌రిస్తే ఆ ద‌ర‌ఖాస్తును తిర‌స్క‌రిస్తారు. నియామ‌కం త‌రువాత ఏవైనా లోపాటు ఉంటే, ఏ నోటీసు లేకుండానే ఉద్యోగిని తొల‌గిస్తారు. భూ ప‌రిపాల‌న ప్ర‌ధాన కమిష‌న‌ర్‌కు టెర్మినేట్ చేసే అధికారం ఉంది.

ద‌ర‌ఖాస్తు ఎలా చేసుకోవాలి

అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తును ఆన్‌లైన్‌లో చేసుకోవాలి. అధికారిక వెబ్‌సైట్‌ https://visakhapatnam.ap.gov.in/ లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేష‌న్‌కు సంబంధించిన ఇత‌ర వివ‌రాలు కూడా అందులో ఉంటాయి. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు స‌మ‌ర్పించిన త‌రువాత‌, ద‌ర‌ఖాస్తుదారు దాని ప్రింటెండ్ కాఫీతో పాటు సంబంధిత విద్యార్హ‌త ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల‌ను విశాఖ‌ప‌ట్నం క‌లెక్ట‌ర్ కార్యాల‌యానికి అంద‌జేయాలి.