4455 ప్రొబేషనరీ ఆఫీసర్‌ జాబ్స్.. ఇంకా కొన్ని రోజులే ఛాన్స్

www.mannamweb.com


బ్యాంక్ జాబ్ మీ లక్ష్యమా? బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఇటీవల ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ భారీస్థాయిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ బ్యాంకుల్లో ఏకంగా 4455 ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ చేసింది. అయితే ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ నిన్నటితో ముగియగా తాజాగా ఐబీపీఎస్ అప్లికేషన్ డేట్ ను పొడిగించింది. మరికొన్ని రోజుల్లోనే దరఖాస్తు ప్రక్రియ ముగియనున్నది. ఇంకా అప్లై చేసుకోని వారుంటే ఇప్పుడే అప్లై చేసుకోండి.

ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) భారీ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 4455 ప్రొబేషనరీ ఆఫీసర్‌ పోస్టుల భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా భారత ప్రభుత్వం గుర్తించిన తత్సమాన విద్యార్హత ఉండాలి. ఆగస్టు 1, 2024 నాటికి కనీసం 20 ఏళ్లు నుంచి 30 ఏళ్లు మించకూడదు. ప్రిలిమ్స్, మెయిన్స్ రాతపరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్టు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత, ఆసక్తి ఉన్న వారు ఆగస్టు 28 వరకు అప్లై చేసుకోవచ్చు.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం పోస్టులు: 4455

అర్హత:

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా భారత ప్రభుత్వం గుర్తించిన తత్సమాన విద్యార్హత ఉండాలి.

వయోపరిమితి:

ఆగస్టు 1, 2024 నాటికి కనీసం 20 ఏళ్లు నుంచి 30 ఏళ్లు మించకూడదు. అనగా, అభ్యర్థులు ఆగస్టు 2, 1994 కంటే ముందు, ఆగస్టు 1, 2004 తర్వాత జన్మించి ఉండాలి. ఇక రిజర్డ్వ్‌ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం:

ప్రిలిమ్స్, మెయిన్స్ రాతపరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్టు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు:

ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు రూ.175 (జీఎస్టీతో కలిపి), మిగతా వాటికి రూ.850 (జీఎస్టీతో కలిపి) చెల్లించాలి.

దరఖాస్తులకు చివరి తేదీ:

28-08-2024