పర్సనల్ లోన్ త్వరగా చెల్లించి, ఆర్థిక భారం తీర్చుకోవాలని చాలా మంది ప్రయత్నిస్తుంటారు. అయితే పర్సనల్ లోన్ త్వరగా క్లోజ్ చేయడం చాలా ముఖ్యమైన విషయం, సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆర్థిక పరమైన చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంది.
పర్సనల్ లోన్ త్వరగా తీర్చేసే కొన్ని సింపుల్ టెక్నిక్స్ గురించి తెలుసుకుందాం!
అదనపు పేమెంట్
పర్సనల్ లోన్ EMI చెల్లింపుల విషయంలో, రెండు వారాలకు ఒకసారి పేమెంట్స్ చేయడం వలన లోన్ తిరిగి చెల్లించే వ్యవధి తగ్గుతుంది. దీని వలన ప్రతి సంవత్సరం కొంత పేమెంట్ అదనంగా చేయవచ్చు, చిన్న పేమెంట్స్ అయినా సరే అదనంగా చెల్లించడం వలన వడ్డీ గణనీయంగా తగ్గి,అప్పు చెల్లించాల్సిన గడువు తగ్గుతుంది.
బోనస్‌లు, బకాయిలు, టాక్స్ రిఫండ్స్ వంటి అప్పుడప్పుడు వచ్చే లాభాలను నేరుగా అసలు అప్పు కట్టేందుకు ఉపయోగించండి. అయితే ఈ పేమెంట్స్ చేసే ముందు, పెనాల్టీలు పడకుండా ఉండాలంటే, లెండర్ ప్రీపేమెంట్ పాలసీని గురించి తెలుసుకోవాలి. కొన్ని బ్యాంకులు వడ్డీ పొదుపులపై అధిక ఛార్జీలు విధించే అవకాశం ఉంది. కాబట్టి రుణదాత(లెండర్) నిబంధనలు, షరతుల గురించి స్పషంగా తెలుసుకోండి.
రీఫైనాన్స్,ట్రాన్స్‌ఫర్ బ్యాలెన్స్
తక్కువ వడ్డీ రేటుతో రీఫైనాన్సింగ్ చేయడం లేదా బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేయడం వల్ల వడ్డీ తగ్గే అవకాశ ఉంది. పర్సనల్ లోన్ రీపేమెంట్ ప్రక్రియ వేగవంతం అవుతుంది. ఏదైనా రీఫైనాన్సింగ్ చేసే సందర్భంలో, మీ బెనిఫిట్స్ తగ్గకుండా చూడాలి. ఏదైనా సందేహం అనిపిస్తే అనుభవజ్ఞులైన ఆర్థిక నిపుణల సలహా తీసుకోవడం మంచిది.
కాన్సాలిడేట్ లేదా రీ-బడ్జెట్ చేయడం
అధిక వడ్డీ కలిగిన అప్పులు అన్ని కలిసి ఒకటిగా విలీనం చేయడం వల్ల మీ పర్సనల్ లోన్ EMI భారం తగ్గుతుంది, ట్రాకింగ్ కూడా సులభతరం అవుతుంది. లోన్ పేమెంట్స్ తగ్గించుకునేందుకు పుట్టినరోజుల ఖర్చు, OTT సబ్‍స్క్రిప్షన్ వంటి ఇతర అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం మంచిది.
ఆదాయాన్ని పెంచుకోండి & పేమెంట్స్ ఆటోమేట్ చేయండి
మీ ఆదాయంతో పాటు సైడ్ ఇన్‌కమ్ కోసం ప్రయత్నించండి. ఫ్రీలాన్సింగ్ వంటి పనులు చేయడం ప్రారంభించాలి. అప్పు తీర్చడమే లక్ష్యంగా ఆర్థిక ప్రణాళిక చేసుకోవడం మంచిది, లేట్ పేమెంట్స్ వంటివి తగ్గించుకోవాలి.
Disclaimer: పై కథనం సమాచారం కోసం మాత్రమే , ఏ విధంగానూ పెట్టుబడి లేదా వ్యాపార సలహాగా భావించకూడదు. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టో కరెన్సీ, రియల్ ఎస్టేట్, బంగారం ఇతర పెట్టుబడి సాధనాలు లాభనష్టాలతో కూడుకున్నవి. మీరు చేసే వ్యాపారాలు, పెట్టుబడులపై మీరు పొందే లాభనష్టాలకు పెట్టుబడి, వ్యాపార సంబంధిత నిర్ణయాలు తీసుకునే ముందు వారి సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారులను సంప్రదించమని సలహా ఇస్తుంది.
































