టాటా మోటార్స్‌కి దేశంలో విశ్వసనీయమైన బ్రాండ్ అనే పేరు ఉంది. ఈ సంస్థకు చెందిన ఓ కారు ఇప్పుడు భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్‌గా అవతరించింది.
దేశంలో నెం.1 కార్ మోడల్‌ని బీట్ చేసే రేంజ్‌లో ఈ కారు అమ్మకాలు పెరిగాయి. ఇప్పటివరకు దేశంలో మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్ దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా ఉంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దీనిని టాటా వెనక్కి నెట్టింది. తాజాగా నంబర్1గా నిలిచిన ఆ కారు వివరాలు ఈ కథనంలో..
టాటా కంపెనీ నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న పంచ్ కారు ఇప్పుడు అత్యధికంగా అమ్ముడవుతున్న నంబర్ 1 కారుగా నిలిచింది. దేశంలో అత్యంత చౌకైన ఎస్‌యూవీలలో పంచ్ ఒకటిగా ఉంది. ఈ కారు మోడల్ మైక్రో ఎస్‌యూవీ కార్ల సెగ్మెంట్ ఫీచర్లు, స్టైలింగ్‌ని కలిగి ఉంటుంది. చిన్నపిల్లలు, పెద్దల సేఫ్టీలోనూ 5 స్టార్ రేటింగ్‌ని కలిగి ఉంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఈ కారు అత్యంత సురక్షితమైన మైక్రో ఎస్‌యూవీగా ఉంది.
ఈ క్వాలిటీ సర్టిఫికేషన్‌తో ఈ కారు తక్కువ ధరకే మార్కెట్‌లో లభిస్తుంది. ఈ రేటింగ్, ఫీచర్లు కారును దేశంలోనే నెంబర్ వన్ సెల్లింగ్ కారు మోడల్‌గా నిలిపాయి. టాటా పంచ్ ఈ ఏడాది జనవరి-జూలై మధ్య 1.26 లక్షల యూనిట్లను విక్రయించి టాప్‌లో నిలిచింది. మరింత స్పష్టంగా చెప్పాలంటే, 2024 మొదటి 7 నెలల్లో భారీ స్థాయిలో అమ్మకాలతో సత్తా చాటింది.
తద్వారా దేశంలోనే పంచ్ అత్యధికంగా అమ్ముడవుతున్న నంబర్ 1 కారు మోడల్‌గా నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఉంది. 1.16 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. వ్యాగన్‌ఆర్ గత కొన్ని సంవత్సరాలుగా నంబర్ 1 కారు మోడల్ స్థానాన్ని ఆక్రమిస్తూ వస్తుంది. తిరుగులేని శక్తిగా దూసుకెళ్తున్న వ్యాగన్‌ఆర్‌కి టాటా పంచ్ చెక్ పెట్టింది. ఇది మారుతి సుజుకికి అతిపెద్ద దెబ్బగా భావిస్తున్నారు.
మారుతి సుజుకి వ్యాగన్ఆర్ తర్వాత దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మూడో కారుగా హ్యుందాయ్ క్రెటా ఉంది.ఈ కారు మొత్తం 1.09 లక్షల యూనిట్ల అమ్మకాలతో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత మారుతి సుజుకి బ్రెజా నాల్గవ స్థానంలో, మారుతి సుజుకి ఎర్టిగా ఎంపీవీ 5 స్థానంలో ఉన్నాయి. ఈ ఏడాది మొదటి ఏడు నెలల్లో బ్రెజా 1.05 లక్షల యూనిట్లను విక్రయించగా, ఎర్టిగా 1.04 లక్షల యూనిట్లను విక్రయించింది.
పంచ్ ధర మరియు సేఫ్టీ సామర్ధ్యం భారతదేశంలో నంబర్ 1 సెల్లింగ్ కారుగా నిలిపాయి అనడంలో ఎటువంటి సదేహం లేదు. టాటా ఈ కారు మోడల్‌ని వివిధ వెర్షన్‌లో అందించడం సేల్స్ పెరగడానికి ఓ ప్రధాన కారణంగా చెప్పవచ్చు. టాటా మోటార్స్ ఈ కారును పెట్రోల్, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ వెర్షన్‌లలో అందిస్తుంది.
అందుకే ఈ పంచ్ మైక్రో ఎస్‌యూవీకి భారతీయులను నుంచి భారీ స్పందన లభిస్తోంది. భారతదేశంలో టాటా పంచ్ దీని ప్రారంభ ధర రూ.6 లక్షలుగా ఉంది. ఇది కేవలం ఎక్స్ షోరూమ్ ధర మాత్రమే కావడం గమనార్హం. సరసమైన ధరలో హై సేఫ్టీ, ఫీచర్లు టాటా పంచ్‌కి అదనపు ఆకర్షణగా చెప్పవచ్చు. గతంలో టాటా ఇండికా భారతీయ ఆటోమోటివ్ ప్రపంచంలో భారీగా అమ్ముడైన కార్లలో ఒకటిగా ఉంది.