ఈ రోజుల్లో మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమెటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP) ద్వారా ఇన్వెస్ట్ చేసేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ ఆప్షన్‌తో ప్రతి నెలా కొంత మొత్తం ఇన్వెస్ట్ చేసి, లాంగ్ టర్మ్‌లో భారీ సంపద కూడబెట్టవచ్చు.
ఎంత ఎక్కువ కాలం సిప్ చేస్తే, అంత ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు. కేవలం రూ.500తో కూడా ఫండ్లలో సిప్ చేయవచ్చు. ఐదు సంవత్సరాల పాటు నెలకు రూ.500, రూ.1,000, రూ.1,500 లేదా రూ.2,000 చొప్పున సిప్ చేస్తే, ఎంత డబ్బు సంపాదించవచ్చో చూద్దాం.
రూ.500 సిప్
ప్రతి నెల రూ.500 చొప్పున సిప్ ఇన్వెస్ట్ చేస్తే, ఐదేళ్లకు రూ.30,000 పెట్టుబడి పెడతారు. సుమారుగా 12% వార్షిక వడ్డీ వస్తుందని అంచనా వేస్తే, మీకు రూ.11,243 వరకు లాభం వస్తుంది. అంటే మొత్తం రాబడి రూ.41,243.
రూ.1,000 సిప్
నెలకు రూ.1,000 పెట్టుబడి పెడితే, 5 సంవత్సరాలలో చేసే మొత్తం ఇన్వెస్ట్మెంట్ రూ.60,000 అవుతుంది. 12% రాబడిని అంచనా వేసుకుంటే, లాభం రూ.22,486 వరకు ఉంటుంది. అసలు, లాభం కలిపి ఐదేళ్లకు రూ.82,486 అందుకుంటారు.
రూ.1,500 సిప్
నెలకు రూ.1,500 సిప్ చేస్తే, ఐదేళ్లలో మొత్తం పెట్టుబడి రూ.90,000 అవుతుంది. 12% వడ్డీ రేటు ప్రకారం, సుమారు రూ.33,730 వరకు సంపాదించవచ్చు. ఐదేళ్లకు రూ.1,23,730 అందుకుంటారు.
రూ.2,000 సిప్
నెలకు రూ.2,000 సిప్ ద్వారా ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే, ఐదేళ్లకు రూ.1,20,000 పెట్టుబడి పెడతారు. 12% రాబడితో లాభం రూ.44,973 అనుకుంటే, మీరు అందుకునే మొత్తం రూ.1,64,973 అవుతుంది.
గుర్తుంచుకోవాల్సిన విషయాలు
SIP రాబడులు మార్కెట్‌తో ముడిపడి ఉంటాయి. 12% రాబడి అనేది అంచనా వేసిన రేటు మాత్రమే. ఇది మార్కెట్ పనితీరును బట్టి ఎక్కువ లేదా తక్కువగా ఉండవచ్చు. కానీ దీర్ఘకాలంలో SIPలు చక్రవడ్డీ/కాంపౌండ్ ఇంట్రెస్ట్, రూపాయి వ్యయ సగటు (Rupee Cost Averaging) డబ్బును పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మంచి రాబడి పొందాలంటే కనీసం 5-10 ఏళ్లు పెట్టుబడి పెట్టడం తెలివైన పని.
సిప్ వడ్డీ ఎలా లెక్కిస్తారు?
సిప్ రూపంలో ప్రతి నెలా కొంత మొత్తం పెట్టుబడి పెడుతున్నారు. కాబట్టి, ప్రతి నెల పెట్టిన పెట్టుబడికి మిగిలిన కాలానికి వడ్డీ లెక్కిస్తారు. ఇది కొంచెం కష్టమైన లెక్క, కానీ ఒక ఉదాహరణతో చూద్దాం,
మొదటి నెల: మీరు రూ.500 పెట్టుబడి పెట్టారు. ఒక నెల తర్వాత, 12% వార్షిక వడ్డీ రేటు ప్రకారం, నెలకు ఎంత వస్తుందో లెక్కిస్తారు.
రెండవ నెల: మీరు మళ్లీ రూ.500 పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు, మొదటి నెలలో పెట్టిన రూ.500 + ఈ నెలలో పెట్టిన రూ.500 రెండింటికీ మిగిలిన కాలానికి వడ్డీ వస్తుంది. మొదటి నెల పెట్టుబడిపై వచ్చిన వడ్డీపై కూడా వడ్డీ వస్తుంది (ఇదే కాంపౌండ్ ఇంట్రెస్ట్).
ఇలా ప్రతి నెలా జరుగుతుంది. మీరు పెట్టిన ప్రతి రూ.500 పెట్టుబడిపై, అది ఇన్వెస్ట్ చేసినప్పటి నుంచి మిగిలిన కాలానికి వడ్డీ వస్తుంది. మునుపటి నెలల్లో వచ్చిన వడ్డీలు కూడా తిరిగి పెట్టుబడిలో చేరి వడ్డీని సంపాదిస్తాయి.
సిప్ రిటర్న్స్‌ను కచ్చితంగా లెక్కించడానికి ప్రత్యేకమైన ఫార్ములాలు లేదా ఆన్లైన్ సిప్ కాలిక్యులేటర్లు ఉంటాయి. ఆ కాలిక్యులేటర్లలో మీ పెట్టుబడి మొత్తం, కాలపరిమితి, అంచనా వేసిన వడ్డీ రేటును ఎంటర్ చేస్తే, అది మీకు మరింత కచ్చితమైన ఫలితాన్ని ఇస్తుంది.
SIP వ్యూహాలు
– వీలైనంత త్వరగా పెట్టుబడి ప్రారంభిస్తే, చక్రవడ్డీ ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి.
– ఆదాయం పెరిగితే, SIP మొత్తాన్ని ఏటా 10-15% పెంచాలి.
– సిప్‌లు 7-10 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు పెట్టుబడి పెడితే మంచి ఫలితాలను ఇస్తాయి.
– లార్జ్-క్యాప్, మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలి.
– క్రమం తప్పకుండా పెట్టుబడులను రివ్యూ చేసుకోవాలి, అవసరమైతే పోర్ట్‌ఫోలియోను సర్దుబాటు చేసుకోవాలి.