ఏపీకి మోదీ మరో బంపర్ ఆఫర్…! కొత్తగా 50 మంది ఎమ్మెల్యేలు..?

www.mannamweb.com


ఏపీలో నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కదలిక వచ్చింది. 2026 నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఖాయమని తేలింది. జన గణనతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం తరువాతనే పునర్విభజన అని సంకేతాలు వచ్చాయి.

దీంతో 2026లో నియోజకవర్గాల పునర్విభజన అని స్పష్టమౌతోంది. అదే జరిగితే ఏపీలో అదనంగా మరో 50 నియోజకవర్గాలు ఏర్పాటు కానున్నాయి. అదే జరిగితే రాజకీయ ఆశావహులకు కొంతవరకు అవకాశాలు మెరుగుపడినట్టే.

2014లో రాష్ట్ర విభజన జరిగింది. 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 పార్లమెంటు స్థానాలతో నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పాటయింది. తెలంగాణకు సంబంధించి 117 అసెంబ్లీ స్థానాలతో పాటు 17 పార్లమెంటు స్థానాలు మిగిలాయి. పాలనా వికేంద్రీకరణ అవసరమని అప్పటి విభజన బిల్లులో స్పష్టం చేశారు. నియోజకవర్గాల పునర్విభజనతో నియోజకవర్గాల సంఖ్య పెరగాలని అందులో పొందుపరిచారు. కానీ 2026 నాటికి నియోజకవర్గాల పెంపు అనివార్యమని తెలుస్తోంది.

నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో.. ప్రతి లోక్ సభ స్థానం పరిధిలో రెండు అసెంబ్లీ సీట్లు పెంచాలన్న ఆలోచన ఉంది. 2026 ద్వితీయార్థంలో పునర్విభజన ప్రక్రియ ప్రారంభం కానుంది. వీలైనంత త్వరగా పునర్విభజన ప్రక్రియ పూర్తి చేసి కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలను ప్రకటించాలని కేంద్రం భావిస్తోంది. 2025లో జనగణను పూర్తిచేసి.. వెనువెంటనే మహిళా బిల్లును సైతం ఆమోదం పొందాలని ప్రభుత్వం భావిస్తోంది. అటు తరువాత నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభం కానుంది.

ప్రస్తుతం ఏపీలో టిడిపి, వైసిపి, జనసేన, బిజెపి, కాంగ్రెస్, వామపక్షాలు ఉన్నాయి. అయితే అన్ని పార్టీల్లో నాయకులు ఆశావహులుగా ఉన్నారు. ప్రధానంగా టిడిపి కూటమి, వైసీపీలో ద్వితీయ శ్రేణి నాయకులు సైతం చట్టసభలకు ఎన్నిక కావాలని భావిస్తున్నారు. ఒకవేళ పునర్విభజనతో 50 అసెంబ్లీ స్థానాలు పెరిగితే.. అన్ని పార్టీల్లో ఉన్న ఆశావహులకు చాన్స్ దక్కే అవకాశం ఉంది. అందుకే ఏపీ నేతలు నియోజకవర్గాల పునర్విభజనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 2026 నాటికి ఇది కార్యరూపం దాల్చుతుందని తెలియడంతో సంతోషపడుతున్నారు.