70కి.మీ మైలేజీ, కేవలం రూ.60 వేలు మాత్రమే.. సంచలనం సృష్టించిన హీరో బైక్

www.mannamweb.com


రోజువారీ ప్రయాణానికి బెస్ట్ మైలేజీ ఇచ్చే బైక్ కావాలా, మీ బడ్జెట్ తక్కువగా ఉందా? అయితే ఈ రోజు మనం హీరో మోటోకార్ప్ పాపులర్ బైక్ గురించి తెలుసుకుందాం.

ఇది ధర తక్కువ అయినప్పటికీ అద్భుతమైన మైలేజీని ఇస్తుందనే పేరు సొంతం చేసుకుంది. అందుకే ప్రతీ ఒక్కరూ ఈ బైక్‌ను ఇష్టపడుతున్నారు. ఈ బైక్ పేరే Hero HF Deluxe, ఈ మోటార్ సైకిల్ ధర ఎంత, ఈ బైక్ ఒక లీటర్ పెట్రోల్‌కు ఎన్ని కిలోమీటర్లు నడపగలదు? వంటి డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు తెలుసుకుందాం.

హీరో HF డీలక్స్ ధర

హీరో మోటోకార్ప్ ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ బైక్ బేస్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 59,998 గా ఉంది. ఈ బైక్ టాప్ వేరియంట్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, అందుకోసం రూ. 69,018 (ఎక్స్-షోరూమ్) వెచ్చించాల్సి ఉంటుంది.

హోండా షైన్ 100 ధర

హోండా షైన్ 100 మోడల్ బైకులో ఒకే ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. ఈ బైక్ ధర ఎక్స్-షోరూమ్ రూ. 64,090 గా ఉంది. 70 వేల రూపాయల కంటే తక్కువ ధర కలిగిన ఈ బైక్‌లో 98.98 సిసి ఇంజన్ ఇచ్చారు. ఇక ఈ బైక్ మైలేజ్ విషయానికొస్తే.. ఒక లీటర్ పెట్రోల్‌కు 65 కిమీ మైలేజ్‌ ఇస్తుంది.

హీరో హెచ్ ఎఫ్ డీలక్స్ vs హోండా షైన్ 100

హీరో కంపెనీకి చెందిన ఈ బైక్‌లో 97.2 CC సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ 7.9bhp పవర్ , 8.05Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు, హోండా బైక్ 7.6bhp పవర్ , 8.05Nm టార్క్ ఉత్పత్తి చేసే 99.7 cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్‌తో వస్తుంది.

మైలేజీ

* హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ మైలేజ్ విషయానికొస్తే.. హీరో మోటోకార్ప్ బైక్ ఒక లీటర్ పెట్రోల్‌కు 70 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుంది.

* హోండా షైన్ 100 మైలేజ్ విషయానికొస్తే.. ఈ బైక్ ఒక లీటర్ పెట్రోల్‌కు 55 నుండి 65 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు.

Note : ఈ వివరాలు కేవలం సమాచారం కోసం మాత్రమే. మీరు కొనుగోలు చేయాలనుకునే బైక్ గురించి పూర్తిగా పరిశీలించిన తరువాతే నిర్ణయం తీసుకోండి.