రూ.15 వేల కంటే తక్కువ ధరలో 7000mAh బ్యాటరీ

 ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ మోటోరోలా నుంచి భారత్‌ మార్కెట్‌లోకి త్వరలో సిగ్నేచర్‌ స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది.

ఈ హ్యాండ్‌సెట్ ఇప్పటికే గ్లోబల్‌ మార్కెట్‌లో అందుబాటులో ఉంది. గత నెలలో మోటో G57 పవర్ 5G స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్‌ ప్రస్తుతం రూ.15 వేల కంటే తక్కువ ధరలో అందుబాటులో ఉంది. అయితే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత OS, 7000mAh బ్యాటరీని కలిగి ఉంది.


మోటో G57 పవర్‌ స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం మోటో ఇండియా వెబ్‌సైట్‌, ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14999 గా ఉంది. అయితే ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై డిస్కౌంట్‌ను కూడా అందిస్తోంది. మోటో వెబ్‌సైట్‌లో SBI, ICICI క్రెడిట్‌ కార్డులు, HDFC డెబిట్‌ కార్డుపై రూ.2000 వరకు డిస్కౌంట్‌ పొందవచ్చు.

స్మార్ట్‌వాటర్‌ టచ్‌ 2.0 ఫీచర్‌ :

మోటో G57 పవర్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ 6.72 అంగుళాల ఫుల్ HD+ LCD డిస్‌ప్లే తో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1050 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 120Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 7i ప్రొటెక్షన్‌ను పొందుతోంది. స్మార్ట్‌వాటర్‌ టచ్‌ 2.0 ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. ఫలితంగా తడిచేతులతోనూ వినియోగించుకోవచ్చు.

ఆండ్రాయిడ్‌ 16 OS :

ఈ హ్యాండ్‌సెట్‌ స్నా్ప్‌డ్రాగన్‌ 6s జెన్‌ 4 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్‌ 4GB LPDDR4X ర్యామ్, 128GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత OS పైన పనిచేస్తోంది. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 17 OS, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని మోటో తెలిపింది.

50MP కెమెరా :

కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలు ఉన్నాయి. ఇందులో 50MP సోనీ LYT 600 ప్రైమరీ లెన్స్‌, 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా, 2 ఇన్ 1 లైట్‌ సెన్సర్‌లు ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరాలతో 60fps వద్ద 2K వీడియోలను రికార్డు చేయవచ్చు.

7000mAh బ్యాటరీ :

ఈ ఫోన్‌ కెమెరాలు సినిమాటిక్‌ ఫోటోస్‌, ఫోటో అన్‌బ్లర్‌, ఆటో ఫ్రేమ్‌, పొర్ట్రెయిట్‌ బ్లర్‌, పొర్ట్రెయిట్‌ లైట్‌, మేజిక్‌ ఎరేజర్‌ వంటి ఇమేజింగ్‌ ఫీచర్లు ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్‌ 33W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 7000mAh బ్యాటరీని కలిగి ఉంది.

కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్‌ 5.1, వైఫై, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. యాంబియంట్‌ లైట్‌ సెన్సర్, ఇ-కంపాస్, ప్రాక్సిమిటీ సెన్సర్, గైరోస్కోప్‌ ఉన్నాయి. సెక్యూరిటీ కోసం సైడ్‌ మౌంటెడ్ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ను అమర్చారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ పాంటోన్‌ ప్యూడిటీ, పాంటోన్‌ కోర్సెయిర్‌, పాంటోన్‌ రెగట్టా కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.