కేంద్ర ఉద్యోగులకు శుభవార్త. త్వరలో ఉద్యోగుల జీతం 186 శాతం పెరిగే అవకాశం ఉంది. నిజానికి 8వ వేతన సంఘం (8th Pay Commission) గురించి గత కొన్ని రోజులుగా ప్రజల్లో తీవ్ర చర్చలు జరుగుతున్నాయి.
ప్రతి ఉద్యోగి దీని గురించి మాట్లాడుతున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. నివేదికల ప్రకారం.. 8వ వేతన సంఘం అమలులోకి వస్తే కేంద్ర ఉద్యోగుల కనీస వేతనం 186 శాతం పెరగవచ్చు. ఇప్పుడు 7వ వేతన సంఘం ప్రకారం.. ఉద్యోగుల మూల వేతనం నెలకు రూ.18,000. స్పెషల్ పే కమిషన్ నుంచి రూ.7000 పెంచారు.
7వ వేతన సంఘం అమలులోకి వచ్చి నేటికి ఎనిమిదేళ్లు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు 8వ వేతన సంఘం కోసం చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. సంభావ్య ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 ప్రకారం కనీస వేతనం రూ.18,000 నుంచి రూ.51,480కి పెరగవచ్చు. పెన్షనర్లకు కూడా ఉపశమనం లభిస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు 7వ వేతన సంఘం కింద జీతం చెల్లిస్తున్నారు, ఇందులో కనీస మూల వేతనం రూ. 18,000. ఇంతకుముందు 6వ పే కమిషన్ కింద ఈ బేసిక్ జీతం రూ. 7,000. ప్రతి కొత్త వేతన సంఘం అమలుతో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో పెద్దఎత్తున దూసుకుపోతున్నట్లు దీన్నిబట్టి స్పష్టమవుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. 8వ వేతన సంఘం అమలు తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల ప్రాథమిక వేతనం 186% వరకు పెరగవచ్చు.
Iconic Bridge : తెలంగాణ-ఏపీ బార్డర్‌లో కృష్ణా నదిపై నాలుగు లేన్ల భారీ వంతెన
కనీస జీతం, పెన్షన్ ఎంత ఉంటుంది?
8వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86ను అమలు చేసే అవకాశం ఉందని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ (జేసీఎం) కార్యదర్శి శివ గోపాల్ మిశ్రా తెలిపారు. ఇదే జరిగితే ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం రూ.18,000 నుంచి రూ. 51,480కి పెరుగుతుంది. అదేవిధంగా, పింఛనుదారులకు కూడా పెద్ద ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుత కనీస పెన్షన్ రూ. 9,000. ఇది 186% పెరిగి రూ. 25,740కి చేరవచ్చు. ఇది ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ గణనపై ఆధారపడి ఉంటుంది. దానిని పెంచడం వల్ల జీతం, పెన్షన్‌లో మరింత పెరుగుదలకు దారితీయవచ్చు.
8వ వేతన సంఘం ప్రకటన వెలువడే అవకాశం ఉంది
8వ వేతన సంఘం ఏర్పాటును ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ మీడియా నివేదికల ప్రకారం.. 2025-26 బడ్జెట్‌లో దీనిని ప్రకటించవచ్చు. గతంలో 2024-25 బడ్జెట్‌లో కూడా ఈ డిమాండ్లు లేవనెత్తగా, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీనిని పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.