బీరకాయే కదా అని చీప్‌గా చూడకండి.. ఎండాకాలంలో తింటే ఆ సమస్యల బాధే ఉండదట..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

బీరకాయ అనేది భారతదేశంలో తినే చాలా సాధారణమైన కూరగాయ.. దీనిలో అనేక రకాల పోషకాలు సమృద్ధిగా నిండి ఉన్నాయి. వాస్తవానికి బీరకాయ నుంచి తయారుచేసిన వంటకాలను చాలా మంది ఇష్టపడతారు.
దీన్ని ఉడికించడానికి ఎక్కువ శ్రమ అవసరం లేదు.. ఎందుకంటే ఇది మృదువైన స్వభావం కలది.. సులభంగా ఉడుకుతుంది.. నిమిషాల్లోనే కూర అవుతుంది.. బీరకాయను పలు రకాలుగా వండుకుని తింటారు. చాలామంది పచ్చడిని తినేందుకు ఇష్టపడతారు. అత్యధిక నీటిశాతం కలిగిన బీరకాయను ఎండాకాలంలో తింటే చాలా మంచిదని ఆరోగ్యనిపుణులు పేర్కొంటున్నారు. ఎన్నో పోషకాలు దాగున్న బీరకాయను క్రమం తప్పకుండా తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి..

పోషకాహారం సమృద్ధిగా ఉంటుంది..

బీరకాయ అనేది పోషకాలతో నిండిన కూరగాయ.. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ కె, ఫోలేట్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు దాగున్నాయి. ఇవి మన శారీరక, మానసిక ఆరోగ్యానికి చాలా అవసరం.

బరువును నియంత్రిస్తుంది..
బీరకాయ ముఖ్యంగా తక్కువ కేలరీలు కలిగి ఉండటంతోపాటు శక్తి వనరు. ఇది అధిక మొత్తంలో నీరు, ఫైబర్ కలిగి ఉంటుంది. ఇది ఆహారాన్ని నిల్వ చేయడంలో సహాయపడుతుంది. ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. అందువల్ల, బీరకాయ కూరగాయ బరువు నియంత్రణకు గొప్ప ఎంపికగా పరిగణిస్తారు.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది..

బీరకాయలో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇది తిన్న తర్వాత, సాధారణంగా గ్యాస్ లేదా అజీర్ణం గురించి ఆందోళన ఉండదు.

గుండెకు మేలు చేస్తుంది..
బీరకాయలో మంచి మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. ఇంకా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

పేగులను శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది..

బీరకాయ పేగులను శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే అనేక లక్షణాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ ఎ, ఫైబర్ ఉన్నాయి. ఇది పొట్టను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. కడుపు సంబంధిత సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *