5 సెకన్ల సీన్.. బిచ్చగాడి జీవితాన్ని మార్చేసింది.. ఇది రియల్ స్టోరీ

www.mannamweb.com


బాలీవుడ్‍లో సోషల్ మేసేజ్‌తో పాటు మనస్సును హత్తుకుపోయే కథలను అందించే డైరెక్టర్ రాజ్ కుమార్ హీరానీ. చేసినవీ కొన్ని సినిమాలే అయినా.. చరిత్రలో గుర్తుండిపోతాయి. ఈ దర్శకుడి డైరెక్షన్లలో నటించాలని ఊవిళ్లూరుతుంటారు ప్రతి ఒక్క హీరో. మున్నా భాయ్ ఎంబీబీఎస్ నుండి ఇటీవల వచ్చిన డంకీ చిత్రం వరకు తనదైన స్టైల్లో మూవీస్ తీసి అలరించాడు. ఇక అమీర్ ఖాన్‌తో తెరకెక్కించిన త్రీ ఇడియట్స్, పీకే బాక్సాఫీసును షేక్ చేసేసిన సంగతి విదితమే. చదువే ముఖ్యం కాదని త్రీ ఇడియట్స్ నిరూపిస్తే.. దేవుడి ముసుగులో దొంగ స్వాములు చేస్తున్న ఆగడాలను చూపించాడు డైరెక్టర్. విమర్శలు ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం ఎప్పటికీ ఆల్ టైమ్ హిట్టే కాదు.. అప్పట్లో అమీర్ ఖాన్ సినిమాల్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. ఇప్పటికీ అమీర్ ఖాన్ కెరీర్ లో హయ్యెస్ట్ కలెక్షన్లు వసూలు చేసిన చిత్రాల్లో మూడవ స్థానంలో ఉందీ పీకే మూవీ.

ఈ సినిమా అమీర్ ఖాన్ జీవితాన్నే కాదు.. ఓ యాచకుడి లైఫ్ కూడా మార్చేసిందని తెలుసా.. వినడానికి వింతగా అనిపించిన ఇది యదార్థం. పీకే సినిమాలో ఓ గ్రహంతర వాసి అయిన అమీర్ ఖాన్.. ఓ గుడ్డి యాచకుడి గిన్నెలో నుండి డబ్బులు తీసుకున్న సీన్ గుర్తుందా.. ఆ డబ్బులతో మందు కొనుక్కుని వెళ్లి ముస్లిం మతస్థుల కోపానికి బలౌతాడు మన హీరో. ఆ సీనులో నటించిన యాచకుడు.. రియల్ లైఫ్‌లో కూడా బిచ్చమెత్తకుని జీవిస్తుంటాడు. ఈ మూవీలో ఆ బిచ్చగాడు కనిపించేది ఐదు నుండి పది సెకన్లు లోపు మాత్రమే కానీ.. సీన్ రియలిస్టిక్‌గా ఉండాలన్న ఉద్దేశంతో దర్శకుడు ఎనిమిది మందిని బిచ్చగాళ్లలో ఇతడిని ఎంపిక చేశాడు. ఇతడు ఎవరంటే మనోజ్ రాయ్. ఈ సినిమాతో రాత్రికి రాత్రే అతడి జీవితం మారిపోయింది.

ఉత్తర అస్సాంలోని సోనిత్ పూర్‌కు చెందిన మనోజ్ తండ్రి రోజు వారీ కూలీ. అతడు పుట్టిన నాలుగు రోజులకే తల్లి చనిపోవడంతో.. తన జీవనోపాధి కోసం యాచక వృత్తిని ఎంచుకున్నాడు. ఢిల్లీలో జనాభా ఎక్కువ ఉంటారు..తనకు బాగా ఆదాయం వస్తుందన్న ఉద్దేశంతో తన మకాం హస్తీనాకు మార్చాడు. నిత్యం రద్దీగా ఉండే జంతర్ మంతర్ దగ్గర బిక్షాటన చేసేవాడు. కానీ ఓ రోజు అతడి అదృష్టం రాజ్ కుమార్ హీరానీ రూపంలో తలుపు తట్టింది. ఓ ఇద్దరు వ్యక్తులు అతడి వద్దకు వచ్చి.. సినిమాల్లో నటిస్తావా అని అడగ్గా.. తన నటనే.. తనకు రెండు రోజులు భోజనం పెడుతుందని సమాధానం ఇచ్చాడు. దీంతో అతడికి రూ. 20 అందించి, ఫోన్ నంబర్ ఇచ్చి వెళ్లిపోయారు.

ఆ నంబర్‌కు ఫోన్ చేయగా.. నెహ్రూ స్టేడియానికి రావాలని తెలిపారు. మరుసటి రోజు అక్కడి వెళ్లగా.. తనలా ఏడుగురు బిచ్చగాళ్లతో కలిసి ఆడిషన్ చేశారు. అయితే ఎవరి సినిమా అనేది తెలియదు. చివరకు మనోజ్‌ను ఎంపిక చేశారు. ఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటల్లో బస ఇచ్చారు. అక్కడ అన్ని సదుపాయాలు అనుభవించాడు. ఐదు సెకన్ల పాటు యాక్షన్ చేసినందుకు రూ. 10 వేలు రెమ్యునరేషన్ ఇచ్చారు. సినిమాలో అవకాశం దక్కించుకున్న తర్వాత.. తెరపై అతడిని చూసిన గ్రామస్థులకు మనోజ్ హీరో అయ్యాడు. తనకు వచ్చిన ఈ ఫేమ్‌తో తనలో మార్పు చోటుచేసుకుంది. దీంతో అతడు ఇక భిక్షాటన చేయకూడదని నిర్ణయించుకుని.. తన గ్రామంలోనే రెమ్యునరేషన్ డబ్బులతో దుకాణం తెరచి జీవనాన్ని సాగిస్తున్నాడు. ఇల్లు, వాహనాన్ని సమకూర్చుకున్నాడు. అంతేనా.. లవ్ మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా సెటిల్ అయ్యాడట.