IIT Bombay | ఐఐటీ బాంబే విద్యార్ధుల్లో 36 శాతం మందికి దక్కని జాబ్ ఆఫర్లు

www.mannamweb.com


IIT Bombay | అంతర్జాతీయ ఆర్ధిక మందగమనం ప్రతిష్టాత్మక విద్యాసంస్ధల ప్లేస్‌మెంట్స్‌పైనా ప్రభావం చూపుతోంది. ఐఐటీ బాంబే విద్యార్ధుల్లో 36 శాతం మంది అభ్యర్ధులకు ప్రస్తుత ప్లేస్‌మెంట్ సీజన్‌లో ఇప్పటివరకూ ఉద్యోగాలు లభించలేదని వెల్లడైంది.
2000 మంది నమోదిత విద్యార్ధుల్లో 712 మందికి ఇప్పటికీ జాబ్ ఆఫర్లు రాలేదు.

అంతర్జాతీయ ఆర్ధిక మందగమనంతో గత ఏడాది తరహాలో క్యాంపస్‌కు కంపెనీలను ఆహ్వానించడంలో సమస్యలు ఎదురవుతున్నాయని ఐఐటీ బాంబే ప్లేస్‌మెంట్ విభాగాధికారి తెలిపారని ఓ వార్తాకథనం తెలిపింది. విద్యాసంస్ధ ముందుగా నిర్ణయించిన వేతన ప్యాకేజ్‌లను అంగీకరించేందుకు చాలా కంపెనీలు తటపటాయిస్తున్నాయని సమాచారం. ప్లేస్‌మెంట్స్‌లో పాల్గొనే ముందు పలు దశల్లో ఆయా కంపెనీలు సంప్రదింపులు జరుపుతున్నాయని అధికారులు తెలిపారు.

ఐఐటీ బాంబే ప్లేస్‌మెంట్స్‌లో నమోదు చేసుకున్న సీఎస్ఈ విద్యార్ధులు పూర్తిస్ధాయిలో జాబ్ ఆఫర్లు పొందలేకపోవడం ఇదే తొలిసారి. ఐఐటీ బాంబేలో ప్లేస్‌మెంట్స్ ప్రక్రియ పురోగతిలో ఉండగా ఈ ఏడాది మే వరకూ ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఈ ఏడాది 35.8 శాతం విద్యార్ధులకు ఇప్పటివరకూ జాబ్ ఆఫర్స్ లభించలేదు. ఇది గత సెషన్ కంటే 2.8 శాతం అధికం కావడం గమనార్హం. ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లో పాల్గొన్న కంపెనీల్లో 380 కంపెనీలు దేశీ కంపెనీలు కాగా, గ్లోబల్ కంపెనీల సంఖ్య ఈసారి తక్కువగా ఉందని చెబుతున్నారు.