AP Politics: వారందరికీ ఏప్రిల్ నుంచే రూ. 4 వేలు పింఛన్‌ పంపిణీ..

www.mannamweb.com


రాష్ట్రంలో పింఛనుదార్ల మరణాలకు నైతిక బాధ్యత వహిస్తూ జగన్‌(YS Jagan) వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. తూర్పుగోదావరి(East Godavari) జిల్లా నల్లజర్లలో(Nallajarla) మీడియా సమావేశంలోనూ, పశ్చిమ గోదావరి(West Godavari) జిల్లా నరసాపురం, పాలకొల్లు పట్టణాల్లో నిర్వహించిన ప్రజాగళం యాత్రలోనూ చంద్రబాబు(Chandrababu) మాట్లాడారు.

రాజమహేంద్రవరం, భీమవరం/నరసాపురం/పాలకొల్లు, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): ‘‘ఏప్రిల్‌ నుంచే రూ.4 వేల చొప్పున పింఛన్‌ ఇస్తాను. ఏప్రిల్‌, మే, జూన్‌ల్లో మీరు తీసుకునే రూ.మూడు వేలకు అదనంగా వెయ్యి చొప్పున జూలై నుంచి ఇచ్చే పింఛన్‌లో కలిపి అందిస్తాను’’ అని తెలుగుదేశం పార్టీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పింఛనుదార్ల మరణాలకు నైతిక బాధ్యత వహిస్తూ జగన్‌(YS Jagan) వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో మీడియా సమావేశంలోనూ, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, పాలకొల్లు పట్టణాల్లో నిర్వహించిన ప్రజాగళం యాత్రలోనూ చంద్రబాబు మాట్లాడారు. పింఛనుదార్లను చంపేసి మరోసారి శవరాజకీయం చేసి లబ్ధి పొందాలని జగన్‌ ప్రయత్నం చేస్తున్నారని, ఇది క్షమించరాని నేరమని ఆగ్రహించారు.

వలంటీర్ల ఉద్యోగాలు ఉంటాయి…

‘‘వలంటీర్ల వ్యవస్థను ఎన్నికల్లో జోక్యం చేసుకోనీయవద్దని ఎన్నికల కమిషన్‌ ఆదేశాలిచ్చింది. పెన్షన్లు డోర్‌ డెలివరీ చేయవద్దని చెప్పలేదు. ఈసీ ఇచ్చిన ఆర్డర్‌ ఒకటైతే, జగన్‌ ప్రభుత్వం చేసిన పని మరొకటి. వలంటీర్లను అధికార పార్టీ ఎన్నికల కోసం ఉపయోగించుకుంది. జగన్‌…వలంటీర్లు తమ సైన్యం అంటున్నాడు. రాజీనామా చేసిన వలంటీర్లకు ఉద్యోగాలు ఇచ్చే మొదటి ఫైలుమీద సంతకం పెడతానని సిగ్గులేకుండా చెబుతున్నాడు. మేం తటస్థంగా ఉండమని మాత్రమే వలంటీర్లను అడిగాం. మీ వ్యవస్థకు మేం వ్యతిరేకం కాదు. ఇంకా మీలో బాగా చదువుకున్నవారి కెరీర్‌ పెరిగేలా, మరింత ఆదాయానికి ఏమి చేయాలో చేసే బాధ్యత మాదని పదేపదే చెప్పాం. రాష్ట్రవ్యాప్తంగా లక్షా 26 వేల మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. వారితో పింఛన్ల పంపిణీ చేయిస్తే ఒక రోజు కాకపోతే, రెండోరోజుకు అయిపోతుంది. అలాంటిది చేయలేదు. పైగా నేనేదో అడ్డుపడినట్టు ప్రచారం చేస్తున్నారు.. మేం చాలా స్పష్టంగా ఉన్నాం. వలంటీర్లు రాజకీయాల్లో జోక్యంచేసుకోవడానికి వీల్లేదు. వలంటీర్లకు పూర్తిగా హామీ ఇచ్చాం. మీ ఉద్యోగాలు ఉంటాయి. మీ కెరీర్‌ కూడా బిల్డప్‌ చేస్తామని చెప్పాం’’

పెన్షన్‌ పేటెంట్‌ టీడీపీదే..

‘‘పెన్షన్ల పేటెంట్‌ హక్కు టీడీపీదే. ఎన్నికల్లో గెలవగానే పెన్షన్లు పెంచుతామని మొదట చెప్పిన పార్టీ తెలుగుదేశం. మొదట తేదీనే ఇస్తాం. ఇంటి దగ్గరే ఇస్తాం. పెంచిన రూ.4వేలు ఇస్తాం. ఒకవేళ ఒక నెలలో తీసుకోకపోతే మూడు నెలల వరకూ ఒకేసారి తీసుకునే వెసులుబాటు ఇస్తాం. మీ ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటాను. సైకో తాత్కాలికంగా ఆనందిస్తాడు. అంతిమంగా ధర్మం గెలుస్తుంది. గడిచిన ఐదేళ్లలో జగన్‌ రూ.13 లక్షలకోట్లు అప్పుతెచ్చాడు. ఖజానా ఖాళీ అయ్యింది. ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు ఇవ్వలేదు. జగన్‌ను చూస్తుంటే పాత సినిమాలో విలన్‌ నాగభూషణం గుర్తుకొస్తున్నాడు. ఫ్యాన్‌ అరిగిపోయింది. దాన్ని ముక్కలు ముక్కలు చేయాలి. జగన్‌ ఎక్స్‌ఫైర్డ్‌ మెడిసిన్‌.’’

వచ్చాడు.. బచ్చా

‘‘నా 40 ఏళ్ల అనుభవంలో ఎవరూ నాతో పెట్టుకోలేదు. వచ్చాడు.. బచ్చా.. వదలను.. నా తడాఖా చూపిస్తా. జాబ్‌ రావాలంటే రాష్ట్రంలో ఎన్డీయే రావాలి. నిరుపేదలకు రెండు సెంట్ల స్థలం ఇచ్చి ఇళ్లను నిర్మించి ఇస్తాం. వైసీపీ ఇచ్చింది సెంటు స్థలం. దానికి కూడా లంచాలు తీసుకున్నారు. కొత్తగా భూహక్కు చట్టం తీసుకొచ్చారు. ఇప్పటివరకు జగన్‌ ప్రభుత్వ స్థలాలు అమ్ముకున్నాడు. ఈ చట్టం అమల్లోకి వస్తే ప్రజల ఇళ్లు, ఆస్తులు కూడా తనఖా పెట్టి అప్పులు తెచ్చుకుంటాడు. ఒంటిమిట్టలో ఒక కార్మికుడు తనకున్న నాలుగు ఎకరాల భూమి అమ్ముకుందామని అనుకున్నాడు. కానీ రికార్డులు తారుమారయ్యాయి. ఎవరికి చెప్పినా.. న్యాయం జరగలేదు. చివరికి రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత భార్య, కూతురు విషం తాగి మరణించారు.’’ అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘పెన్షనర్ల పట్ల జగన్‌ నీచంగా, దుర్మార్గంగా ప్రవర్తించాడు. ఆయనను ఈసీ ప్రశ్నించాలి. జగన్‌ చేతకాని తనం, దురుద్దేశ చర్యలతో కొంతమంది పెన్షనర్లు చనిపోయారు. అవి ప్రభుత్వ హత్యలు. ఈ హత్యలు చేసిన ముఖ్యమంత్రికి ప్రభుత్వంలో కొనసాగే నైతిక హక్కు లేదు. వెంటనే రాజీనామా చేయాలి’’

‘‘నేను మెగా డీఎస్సీపై తొలి సంతకం పెడతానంటే.. జగన్‌ రాజీనామా చేసిన వలంటీర్ల నియామకంపై తొలి సంతకం చేస్తానంటున్నాడు. నాది సమాజహితం. జగన్‌ది స్వార్ధం. జాబ్‌ రావాలంటే రాష్ట్రంలో ఎన్డీయే రావాలి, గంజాయ్‌ కావాలంటే జగన్‌ రావాలి’’