రైలు పైకప్పుపై గుండ్రని ఆకారంలో మూతలు ఎందుకు పెడతారు..?

www.mannamweb.com


రైలుకు సంబంధించి ఎన్నో రహస్యాలు మనకి తెలియవు. చాలా మంది ట్రైన్ లో వెళ్ళామా వచ్చామా అనే చూసుకుంటారు తప్ప రైలుకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలని పెద్దగా పట్టించుకోరు. నిజంగా వాళ్ళకి సందేహం కలిగినా కూడా దానిని తెలుసుకోవాలనుకునే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అయితే ఎప్పుడైనా గమనించినట్లయితే రైలు భోగీల పైన మనకి ఒక గుండ్ర ని ఆకారం లో కనబడుతుంది. రైలు పై కప్పు మీద గుండ్రని ఆకారం మూతలు ఎందుకు ఉంటాయి..?

వాటి వల్ల ఏదైనా ఉపయోగం ఉందా..? లేకపోతే ఊరికే పెట్టారా అనేది చూస్తే దీని వలన మనకెంతో మేలు కలుగుతుంది. రైలు భోగీల మీద ఉండే ఈ రౌండ్ మూతలు సాధారణంగా ట్రైన్ లో ఎక్కువ మంది ట్రావెల్స్ చేస్తూ ఉంటారు. రైలు నుండి వేడిని తొలగించడానికి వీటిని ఏర్పాటు చేయడం జరిగింది.

రైలు లో ఎక్కువ మంది ప్రయాణం చేసినా ఇబ్బంది లేకుండా ఉండేందుకు వీటిని రూపొందించారు. ఒక్కో సారి శ్వాస తీసుకోవడం కూడా ట్రైన్ లో కష్టమవుతుంది. ఈ పైకప్పు వెంటిలేటర్లు ఉండడం వలన తేమ, వేడి తొలగి పోతాయి. అందుకనే ప్రతి రైలు భోగీ పైన ఈ రౌండ్ ప్లేట్స్ ని ఫిక్స్ చేశారు. దాంతో వెంటిలేషన్ ఉంటుంది ఇబ్బంది ఉండదు.