Jeens | జీన్స్‌తో పర్యావరణానికి ఊహించనంత హాని.. ఒక జత జీన్స్‌తో 2.5 కిలోల కార్బన్‌డయాక్సైడ్‌

www.mannamweb.com


ఒక జత జీన్స్‌తో 2.5 కిలోల కార్బన్‌డయాక్సైడ్‌ ఉత్పత్తి
ఇది కారులో 10 కిలోమీటర్లు ప్రయాణించటంతో సమానం
చైనా వర్సిటీ అధ్యయనంలో వెల్లడి
Jeens | బీజింగ్‌, ఏప్రిల్‌ 7: జీన్స్‌తో పర్యావరణానికి ఊహించనంత హాని కలుగుతున్నదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా జీన్స్‌ ఉత్పత్తి అవుతున్నది. దీని ప్రభావంతో కార్బన్‌ డయాక్సైడ్‌ భారీ స్థాయిలో వెలువడుతున్నదని పరిశోధకులు తెలిపారు. చైనాలోని గాంగ్‌డాంగ్‌ యూనివర్సటీ ఆఫ్‌ టెక్నాలజీ పరిశోధకులు జీన్స్‌ వల్ల కలిగే పర్యావరణ కాలుష్యంపై పరిశోధనలు చేయగా.. ఒక జత జీన్స్‌ ధరించటం వల్ల 2.5 కిలోల కార్బన్‌ డయాక్సైడ్‌ ఉత్పత్తి అవుతున్నదని తేలింది.

అంటే.. పెట్రోల్‌ కారులో ఒకసారి 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించటంతో సమానం అని వెల్లడించారు. సంప్రదాయ జీన్స్‌తో పోల్చితే ఫాస్ట్‌ ఫ్యాషన్‌ జీన్స్‌ (ట్రెండ్‌కు తగ్గట్టు తయారుచేసి మార్కెట్‌లోకి విడుదల చేసే జీన్స్‌) జీన్స్‌ సగటున 7సార్లు మాత్రమే ధరిస్తున్నారని, దాంతో అదనంగా 11 రెట్లు కాలుష్యం పెరుగుతున్నదని వివరించారు. ఒక రకంగా 95-99 శాతం ఎక్కువ కార్బన్‌డయాక్సైడ్‌ ఉత్పత్తి అవుతున్నదని స్పష్టం చేశారు. జీన్స్‌ వల్ల వెలువడే కార్బన్‌ డయాక్సైడ్‌లో 48 శాతం ఉతకడం, ఆరబెట్టడం, ఇస్త్రీ చేయడం వల్లే కలుగుతున్నదని పేర్కొన్నారు.