మహిళల కోసం సూపర్ స్కీమ్.. ఇందులో పెట్టుబడి పెడితే కళ్లు చెదిరే రాబడులు

సమాజంలోని కానీ, ప్రతి ఇంట్లో కానీ ఆర్థిక అభివృద్ధిలో మహిళలు కీలక పాత్ర పోషిస్తుంటారు. ఎందుకంటే.. ప్రతి ఇంట్లో కష్టపడి సంపాదిస్తున్న దాంట్లో.. కొంత మొత్తన్ని భవిష్యత్తు కోసం పొదుపు చేయాలని చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఇక పొదుపు చేసి కుటుంబన్ని ముందుకు నడిపించిన విషయంలోనే మహిళలకు సాటి ఎవరు రారు. ఇప్పటికే చాలామంది ఇలా ఇంట్లో కష్టపడిన కొంత సొమ్మును సేవింగ్స్ చేసేందుకు చాలా పథకాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా.. స్టాక్ మార్కెట్ వంటి వాటిలో నగదును పొదుపు చేయడమనేది చాలా రిస్క్ తో కూడుకున్న పని. ఎందుకంటే.. ఇందులో పెట్టిన పెట్టుబడి కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. దీంతో.. చాలామది మహిళలు ఇలాంటి రిస్క్ లేని పథకాల కోసం ఎదురు చూస్తుంటారు. మరి, అలాంటి మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ఓ ప్రత్యేకమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. మరి ఆ స్కీమ్ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

తాజాగా మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం మహిళా సమ్మాన్ సేవింగ్స్ సరిటిఫికేట్ పథకంను అమలులోకి తీసుకొచ్చింది. అయితే ఈ స్కీమ్ అనేది పోస్ట్ ఆఫీసులతో పాటు వివిధ బ్యాంకుల్లోనూ అందుబాటులోకి వచ్చింది. అయితే తక్కువ పెట్టుబడితో ఎలాంటి రిస్క్ లేకుంటా మంచి ఆదాయాన్ని అందించడమే ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం. పైగా కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ లో ప్రస్తుతం వడ్డీ రేటును 7.5 శాతంగా అందిస్తోంది. అంతేకాకుండా.. ఈ పథకం మెచ్యూరిటీ టెన్యూర్ రెండేళ్లుగా వరకు ఉంటుంది. అనగా.. మహిళలు రెండేళ్ల పాటు ఇందులో పెట్టుబడి పెట్టుకోవచ్చు. అలాగే ఇందులో గరిష్ఠంగా రూ. 2 లక్షల వరకు మాత్రమే పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంది. దీంతో పాటు ఇందులో ఇన్వెస్ట్ చేస్తే 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. మరోవైపు.. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సీ కింద పన్ను మినహాయింపులు సైతం క్లెయిమ్ చేసుకోనే అవకాశం ఉంది. ముఖ్యంగా.. ఇందులో 10 ఏళ్ల వయసు కంటే తక్కువగా ఉన్న బాలికల పేరుపైనా కూడా ఖాతా తీసుకోవచ్చు.

ఇక ఈ స్కీమ్ లో ఉదాహరణకు రూ. 2 లక్షలు పెట్టుబడి పెడితే.. మీకు మొదటి ఏడాది 7.5 శాతం వడ్డీ రేటుతో రూ. 15 వేల వడ్డీ లభిస్తుంది. ఇక దానిని అసలుకు జమ చేస్తారు. ఆ తర్వాత రెండో ఏడాదిలో వడ్డీ రూ. 16,125 లభిస్తుంది. అంటే ఈ పథకంలో మహిళలు రూ. 2 లక్షలు పెట్టుబడి పెట్టినట్లియితే వారికి రెండేళ్ల మెచ్యూరిటీ తర్వాత వడ్డీ రూపంలో మొత్తంగా రూ. 31,125 వరకు లభిస్తుంది. అయితే ఈ స్కీమ్ అనేది 2025 వరకే అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత ఈ స్కీమ్ అందుబాటులో ఉండకపోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *