కడపలో మారుతున్న పొలిటికల్ ఈక్వేషన్.!

www.mannamweb.com


వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వైఎస్ షర్మిల పుట్టలేదంటూ, వైఎస్ విజయమ్మ క్యారెక్టర్‌ని బ్యాడ్ చేస్తున్నారు వైసీపీ నేతలు.! ఇదీ ఉమ్మడి కడప జిల్లాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానుల ఆవేదన.! వైఎస్ షర్మిల, వైఎస్ సునీత.. ఉమ్మడి కడప జిల్లా రాజకీయాల్లో పెను సంచలనంగా మారుతున్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, కడప లోక్ సభ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఆమె వైఎస్ జగన్ కోసం సుదీర్ఘ పాదయాత్ర చేశారు. కానీ, ఆమెకు పార్టీలో తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వలేదు వైఎస్ జగన్. వైఎస్ విజయమ్మ విషయంలోనూ వైఎస్ జగన్ వ్యవహరించిన తీరు అందర్నీ విస్మయానికి గురిచేసింది. వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా గతంలో పని చేసిన విజయమ్మని, ఆ పదవిలోంచి పీకి పారేశారు వైఎస్ జగన్. తనంతట తానుగా విజయమ్మ, వైసీపీకి దూరమయ్యేలా చేశారు వైఎస్ జగన్. వైసీపీకి తొలి ఎమ్మెల్యే విజయమ్మ. ఆ విషయాన్ని వైఎస్ జగన్ మర్చిపోతే ఎలా.? వైసీపీకి ఒకప్పుడు స్టార్ క్యాంపెయినర్ వైఎస్ షర్మిల.! కానీ, వైఎస్ జగన్ తన కుటుంబ సభ్యుల మీద కనీసపాటి విశ్వాసం చూపలేదు. తల్లి, చెల్లి విషయంలోనే ఇలా వ్యవహరించిన వైఎస్ జగన్, తన బాబాయ్ వివేకానంద రెడ్డి విషయంలో ఇంకెలా వ్యవహరించేవారో.? అని పులివెందుల నియోజకవర్గంలోనూ, కడప లోక్ సభ నియోజకవర్గంలోనూ జనం చర్చించుకుంటున్నారు. వీటికి తోడు, వైఎస్ షర్మిలను అలాగే వైఎస్ సునీతా రెడ్డినీ పెయిడ్ ఆర్టిస్టులుగా వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అభివర్ణించడం, సజ్జల కుమారుడు భార్గవ్ కనుసన్నల్లో వైసీపీ సోషల్ మీడియా, అత్యంత జుగుప్సాకరమైన రీతిలో షర్మిల, సునీతా రెడ్డి మీద ట్రోలింగ్ చేస్తుండడం.. ఇవన్నీ కడపలో పొలిటికల్ ఈక్వేషన్స్‌ని మార్చేస్తున్నాయి. ఇంట్లోని ఆడవాళ్ళ మీదనే ఇంత జుగుప్సాకరంగా ప్రవర్తిస్తోంటే, చూస్తూ ఊరుకుంటున్న వైఎస్ జగన్, రాష్ట్రంలోని మహిళలకు ఏం భరోసా ఇవ్వగలరనే చర్చ తెరపైకొస్తోంది. రాజకీయాలన్నాక విమర్శలు సహజమే కావొచ్చు.. క్యారెక్టర్ మీద మచ్చ వేయాలని చూడటం.. అదీ కుటుంబంలోని మహిళల మీద.. అత్యంత జుగుప్సాకరం.! అందుకే, వైసీపీకి కంచుకోట అయిన ఉమ్మడి కడప జిల్లాలో, వైసీపీ అంటేనే మహిళా ఓటర్లు అసహ్యించుకునే పరిస్థితి కనిపిస్తోంది.!