Blue Aadhaar: దేశంలో అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్ కార్డ్ ఒకటిగా మారిపోయింది. బ్యాంకింగ్ పనుల నుంచి ప్రభుత్వ పథకాల వరకు ఏది పొందాలన్నా అందుకు ఆధార్ తప్పనిసరి. దీనిని ఇతర అవసరాలకు గుర్తింపు కార్డుగా కూడా పరిగణించబడుతోంది.
కేవైసీ ధృవీకరణ కోసం ఉపయోగించే అతి ముఖ్యమైన పత్రం ఆధార్ కార్డ్. గతంలో పెద్దలకు మాత్రమే ఉన్న ఆధార్ కార్డును 2018 నుంచి చిన్న పిల్లలకు అందుబాటులోకి తీసుకురాబడింది. వీటిని బ్లూ ఆధార్ కార్డ్ అని పిలుస్తారు. ఈ ఆధార్ కార్డ్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(UIDAI) ద్వారా జారీ చేయబడింది. 12 అంకెల ఈ ప్రత్యేక గుర్తింపు కార్డు సంఖ్య వ్యక్తికి వ్యక్తికి మారుతూ ఉంటుంది.
2018లో పుట్టినప్పటి నుంచి ఐదేళ్లలోపు పిల్లలకు బ్లూ ఆధార్ కార్డును ప్రవేశపెట్టాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. పిల్లలు పొందే బ్లూ ఆధార్ కార్డు నమోదు చేసినప్పటి నుంచి కేవలం 5 ఏళ్లు మాత్రమే చెల్లుబాటు అవుతుందని తల్లిదండ్రులు గమనించాలి. దీనిని పొందటానికి ఎలాంటి ప్రధాన పత్రాలు అవసరం ఉండదు. తల్లిదండ్రులు ఉపయోగించే బర్త్ సర్టిఫికేట్ లేదా హాస్పిటల్ డిశ్చార్జ్ స్లిప్ సరిపోతుంది. ఇది కాకుండా పిల్లల బడికి వెళుతుంటే వారి ఐడి కార్డ్ కూడా గుర్తింపుకు స్వీకరించబడుతుంది. ఇప్పుడు ఈ కార్డు పాఠశాల అడ్మిషన్ల కోసం ఉపయోగించబడుతుంది. బ్లూ ఆధార్ కోసం వారి తల్లిదండ్రుల UIDతో లింక్ చేయబడిన ఫోటో మాత్రమే సరిపోతుంది. తర్వాత వారి ఐరిస్, వేలిముద్రలు అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్‌లో బ్లూ ఆధార్ కార్డ్ నమోదు ప్రక్రియ.. 1) బ్లూ ఆధార్ కార్డ్ పొందడానికి ముందుగా మనం అధికారిక వెబ్‌సైట్, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(UIDAI) వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
2) తర్వాత “మై ఆధార్”కి వెళ్లండి. “మై ఆధార్” విభాగాన్ని కనుగొని, “అపాయింట్‌మెంట్ బుకింగ్”పై క్లిక్ చేయండి. 3) ఇక్కడ “చైల్డ్ ఆధార్” ఎంచుకోండి. “న్యూ ఆధార్”ని ఎంచుకుని, మీ మొబైల్ నంబర్, సెక్యూరిటీ కోడ్ (క్యాప్చా) నమోదు చేయండి. “కుటుంబ అధిపతితో సంబంధం” కింద, “చైల్డ్ (0-5 సంవత్సరాలు)” ఎంచుకోండి. 4) మీ పిల్లల వివరాలను పూరించండి. పిల్లల పేరు, పుట్టిన తేదీ, చిరునామాను జాగ్రత్తగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో తల్లిదండ్రులు తమ ఆధార్ కార్డులతో పాటు పిల్లల బర్త్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
5) వివరాలన్నీ పూరించిన తర్వాత అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోండి. సమీపంలోని ఆధార్ సేవా కేంద్రంలో వీలును బట్టి తేదీ, సమయాన్ని ఎంచుకోండి. తర్వాత కేంద్రాన్ని సందర్శించి బ్లూ ఆధార్ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోండి.