High Interest FD: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ ఇస్తున్న 3 బ్యాంకులివే..!!

www.mannamweb.com


Fixed Deposits: ప్రస్తుతం దేశంలోని బ్యాంకులు తమ పెట్టుబడిదారులకు మంచి వడ్డీ రేట్లకు టర్మ్ డిపాజిట్లను ఆఫర్ చేస్తున్నాయి. ద్రవ్యోల్బణం కట్టడిలో భాగంగా సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ వడ్డీ రేట్లను గతంలో పలు దఫాలుగా పెంచిన సంగతి తెలిసిందే.
ఇప్పటికీ భారతీయ కస్టమర్లు ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టేందుకు ఇష్టపడుతున్నారు. సురక్షితమైన పెట్టుబడిగా దేశంలోని ప్రజలు ఫిక్స్‌డ్ డిపాజిట్లలో డబ్బును ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కస్టమర్‌లు నిర్ణీత వ్యవధి తర్వాత హామీ ఆదాయాన్ని పొందుతారు. బ్యాంకులే కాకుండా, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCలు) కూడా తమ కస్టమర్లకు FDపై బంపర్ వడ్డీని అందిస్తున్నాయి. ఈ క్రమంలో 9 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి.
Suryoday Small Finance Bank: సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తన సాధారణ కస్టమర్లకు 5 సంవత్సరాల FDపై 9.10% వడ్డీని అందిస్తోంది. అదే కాలానికి బ్యాంక్ తన సీనియర్ సిటిజన్ కస్టమర్లకు 9.60% వరకు వడ్డీని అందిస్తోంది. Unity Small Finance Bank: యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తన సాధారణ కస్టమర్లకు 1001 రోజుల FDపై 9% వడ్డీని అందిస్తోంది. అదే సమయంలో బ్యాంక్ తన సీనియర్ సిటిజన్ కస్టమర్లకు అదే కాలానికి 9.50 శాతం వడ్డీని అందిస్తోంది. Fincare Small Finance Bank: ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తన సాధారణ కస్టమర్‌లకు 1000 రోజుల FDపై 8.51% వడ్డీని అందిస్తోంది. అదే కాలానికి బ్యాంక్ తన సీనియర్ సిటిజన్ కస్టమర్లకు 9.11 శాతం వడ్డీని అందిస్తోంది.