సజ్జలతో సహా ఏపీ ప్రభుత్వ సలహాదారులకు ఈసీ షాక్; గీత దాటితే వేటే!!

xr:d:DAF_lDtPUYY:3,j:221098330729648236,t:24031710

www.mannamweb.com


ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎన్నికల సమయంలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఏపీలో ఎన్నికల సమయంలో పరిస్థితులు హాట్ హాట్ గా మారుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తున్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తో సహా, ఏపీ ప్రభుత్వ సలహాదారులు అందరికీ ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది.

ప్రభుత్వ సలహా దారులు ఆ పని చేస్తే నేరం : ఈసీ

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు ఎన్నికల ప్రవర్తన నియమావళికి లోబడి పని చేయాలని, వారందరికీ ఎలక్షన్ కోడ్ నియమావళి వర్తిస్తుందని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఏకీకృత నిధి నుండి జీతభత్యాలు తీసుకుంటున్న వారు రాజకీయ ప్రకటనలు చేయడం క్షమించరాని నేరమని, అది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని ఈసీ పేర్కొంది.

గీత దాటితే వేటే

ఎన్నికల షెడ్యూలు వెలువడిన తర్వాత పలువురు ప్రభుత్వ సలహాదారులు రాజకీయ ప్రచారాలలో పాల్గొంటున్నారని, రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేస్తున్నారని పలు పార్టీలు తమకు ఫిర్యాదు చేసినట్టుగా ఈసీ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సలహాదారులకు గీత దాటితే వేటు వేస్తామని హెచ్చరికలు జారీ చేసింది.

మొత్తం 40 మంది ప్రభుత్వ సలహాదారులకు కీలక ఆదేశం

కార్య నిర్వాహక ఉత్తర్వులతో నియమితులైన సలహాదారులు, క్యాబినెట్ మంత్రి హోదాలో ఉంటూ ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ రాజకీయాలు మాట్లాడడం సమంజసం కాదని పేర్కొంది. మొత్తం 40 మంది ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల ప్రవర్తన నియమావళి వర్తిస్తుందని తప్పకుండా వాటిని పాటించాలని ఆదేశాలు జారీ చేసింది.

క్యాబినెట్ హోదాలో ఉన్న మంత్రులలానే వీరికి కూడా

ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి సహా పలువురు సలహాదారులు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ప్రతిపక్షాలను విమర్శిస్తూ ప్రచారం చేస్తున్నట్లుగా ఈసీ గుర్తించింది. ఇక సలహాదారుల తీరుపై సమీక్ష చేసిన ఈసీ క్యాబినెట్ హోదాలో ఉన్న మంత్రులకు ఏ నియమావళి అయితే వర్తిస్తుందో అదే నియమావళి ప్రభుత్వ సలహాదారులకు కూడా వర్తిస్తుందని పేర్కొంది. ఎన్నికల కమిషన్ ఆదేశాలను ఏమాత్రం ఉల్లంఘించినా చర్యలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది.