EPFO: ఈపీఎఫ్ఓ కొత్త రూల్ అదుర్స్.. వైద్యం కోసం లక్ష వరకు

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఖాతాదారులకు కొత్త ఆర్థిక సంవత్సరంలో గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే ఇకపై PF ఖాతాదారులు ఎవరిపై ఆధారపడకుండా వైద్య చికిత్స(medical treatment) కోసం వారి ఖాతా నుంచి లక్ష రూపాయల వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు.
అయితే గతంలో దీని గరిష్ట పరిమితి రూ. 50,000గా మాత్రమే ఉండేది. సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఆమోదం పొందిన తర్వాత ఏప్రిల్ 16 నుంచి ఈ కొత్త రూల్ అమలులోకి వచ్చింది. అంతేకాదు ఏప్రిల్ 10న EPFO అప్లికేషన్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌(software)లో కూడా మార్పులు చేసింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

దీనిని EPFO ఫారమ్ 31లోని 68J పేరా కింద డబ్బు ఉపసంహరణ(withdrawal) పరిమితిని రెట్టింపు చేశారు. గతంలో ఈ మొత్తం రూ.50 వేలు కాగా, ఇప్పుడు లక్ష రూపాయలకు పెంచారు. EPFO ఫారమ్ 31 అనేది పాక్షిక ఉపసంహరణకు సంబంధించినది. ఇది వివిధ ప్రయోజనాల కోసం డబ్బును అకాల ఉపసంహరణకు ఉపయోగించబడుతుంది. వేర్వేరు పనులు, వేర్వేరు పేరాల్లో ఉంచబడ్డాయి. వాటిలో వివాహం, ఇల్లు కట్టడం, ఇల్లు కొనడం, చికిత్స కోసం డబ్బు తీసుకోవడం వంటివి ఇందులో ఉన్నాయి.
ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఉద్యోగి 6 నెలల బేసిక్, డీఏ లేదా వడ్డీతో సహా ఉద్యోగి వాటా (ఏది తక్కువైతే అది) విత్‌డ్రా చేయలేరు. అంటే ఈ మొత్తానికి మించి మీ PFలో రూ. 1 లక్ష ఎక్కువగా ఉంటే మాత్రమే దీనిని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎవరైనా దీన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటే, అతను ఫారం 31 నింపి సమర్పించవచ్చు. కానీ ఈ ఫారమ్‌తో పాటు సర్టిఫికేట్ సీ(form c certificate) సమర్పించాల్సి ఉంటుంది, దీనిలో ఉద్యోగి, డాక్టర్ ఇద్దరి సంతకాలు అవసరం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *