Nokia Boring Phone: నోకియా నుంచి బోరింగ్ ఫోన్.. స్పెషాలిటీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!

www.mannamweb.com


Nokia Boring Phone : స్మార్ట్‌ఫోన్ కంపెనీలు అన్నీ కూడా వేగంగా తమ మార్కెట్‌ను విస్తరిస్తున్నాయి. 4జీ, 5జీ అందిస్తూ లేటెస్ట్ AI టెక్నాలజీతో మొబైల్ లవర్స్‌ను అట్రాక్ట్ చేస్తున్నారు. అయితే ప్రముఖ ఫోన్ల తయారీ కంపెనీ నోకియా ఇందుకు భిన్నంగా కొత్త బోరింగ్ ఫోన్‌ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ స్పెషాలిటీ తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ ఫోన్ తీసుకొచ్చేందుకు హీనెకెన్-బోడెగా అనే సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఫోన్‌ను ఎక్కువ రోజుల పాటు విక్రయించే ఆలోచనలో కంపెనీ లేదు. కేవలం 5,000 యూనిట్ల ఫోన్లను మాత్రమే తయారు చేయనున్నట్లు హీనెకెన్ వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఈ ఫోన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.

హీనెకెన్, బోడెగా సంస్థల సహకారంతో హెచ్‌ఎమ్‌డీ నోకియా బోరింగ్ ఫోన్‌ను ఆవిష్కరించింది. అలానే హ్యాండ్‌సెట్ ఫ్లీప్ స్క్రీన్‌ కలిగి ఉంటుంది. దీని డిజైన్ కూడా కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ ఫోన్‌లోని అత్యంత ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో ఇంటర్నెట్, సోషల్ మీడియా, ఇతర థర్డ్ పార్టీ యాప్‌లు ఇందులో డౌన్‌లోడ్ చేయలేరు.

HMD నోకియా ది బోరింగ్ ఫోన్‌ను ప్రారంభించేందుకు హీనెకెన్, బోడెగా కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రస్తుతానికి ఫోన్‌ను సేల్‌కు తీసుకురావడం లేేదు. ఇది బహుమతుల ద్వారా అందుబాటులో ఉంటుంది. అయితే దీని విక్రయానికి సంబంధించి కంపెనీ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. 5,000 యూనిట్ల ఫోన్‌ను తయారు చేయనున్నట్లు హీనెకెన్ వెబ్‌సైట్‌ ద్వారా వెల్లడించారు.

బోరింగ్ ఫోన్‌లో ఇంటర్నెట్ యాక్సెస్, సోషల్ మీడియా లేదా ఇతర యాప్‌లు లేని ఫీచర్ ఫోన్.
ఇది పాతతరం ఫోన్‌లు, రెట్రో ఫోన్‌ల మాదిరిగానే పని చేస్తుంది. ఇది కాల్స్ చేయడానికి, మెసెజింగ్‌కి మాత్రమే యూజ్ అవుతుంది. ఫ్లిప్‌ను మూసివేయడం ద్వారా కాల్‌ను డిస్‌కనెక్ట్ చేయవచ్చు. హోలోగ్రాఫిక్ స్టిక్కర్‌లను కలిగి ఉంది.

ఫోన్ డిజైన్ నోకియా 2660 ఫ్లిప్‌తో సరిపోతుంది. డిస్‌ప్లే గురించి చెప్పాలంటే, బోరింగ్ ఫోన్‌లో 2.8-అంగుళాల QVGA ఇన్నర్ డిస్‌ప్లే, 1.77-అంగుళాల కవర్ డిస్‌ప్లే ఉంది. ఇది 0.3 మెగాపిక్సెల్ కెమెరా, 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌ని కలిగి ఉంది. ఫోన్ 2G, 3G, 4G నెట్‌వర్క్‌ల ద్వారా కాలింగ్, మెసేజ్‌లకు సపోర్ట్ చేస్తుంది.