ఎర్ర అరటి పండులో విటమిన్ సి, విటమిన్ బి6, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ సమృద్ధిగా, తక్కువ కేలరీలుంటాయి. దీనిని అల్పాహారంగా, డెజర్గా కూడా హెల్తీ ఫుడ్‌గా తీసుకోవచ్చు.
ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇంకా దీనితో ఎన్ని లాభాలంటే..
రోగనిరోధక శక్తి..
రెడ్ అరటిపండులోని మెగ్నీషియం, పొటాషియం వంటి రిచ్ లక్షణాలు రక్తపోటును తగ్గిస్తాయి. ఈ పండులో ఉండే విటమిన్ సి, రోగనిరోధక శక్తిని పెంచే కీలకమైనది. శరీర రోగనిరోధక శర్తిని పెంచడానికి, చర్మాన్ని ఆరోగ్యాంగా ఉంచడానికి కొల్లాజెన్ ఉత్పత్తి చేయడానికి విటమిన్ సి చాలా ముఖ్యమైనది.
కంటి ఆరోగ్యం..
ఎర్రటి అరటి పండులో కెరోటినాయిడ్లు కారణంగా ఈ పండు పై పొర ( తొక్క) ఎర్రగా ఉంటుంది. ఈ అరటి పండును తీసుకోవడం వల్ల ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులోని బీటా కెరోటిన్ కంటి చూపును పెంచుతుంది.
బరువు తగ్గడానికి కూడా..
బరువు తగ్గించుకోవాలని చూసే వారు ఎర్రటి అరటిపండ్లను ఎంచుకోవచ్చు. అధిక ఫైబర్ లక్షణాల కారణంగా ఎర్రటి అరటిపండ్లు తక్కువ కొవ్వును కలిగి ఉంటాయి. చాలా తక్కువ కేలరీల కారణంగా ఎక్కువ సేపు కడుపునిండుగా ఉండేలా చేస్తుంది. ఇది మధుమేహం, గుండె జబ్బులు, ఊబకాయం సమస్యలను తగ్గిస్తుంది.
వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఎర్రటి అరటిపండ్లు తీసుకోవడంతో మినరల్స్, విటమిన్లు పుష్కలంగా అందుతాయి. అలాగే ఇందులోని కార్బోహైడ్రేట్లు మొత్తం ఆరోగ్యాన్ని పెంచుతాయి.