Gold Rate: పసిడి పరుగుల వెనుక చైనా.. షాకింగ్ ధరలకు అసలు కారణం అదే

www.mannamweb.com


Gold Price Today: ప్రపంచ మార్కెట్లలో పసిడి ధర ఎన్నడూ లేని విధంగా ఔన్సుకు 2,400 డాలర్ల మార్కును ఈ ఏడాది దాటేసింది. దీంతో ప్రధానంగా భారతీయ పసిడి ప్రియుల్లో ఆందోళనలు నెలకొన్నాయి. అసలు బంగారం అనే మాట పలకాలంటేనే చాలా మంది వణికిపోతున్నారు.
వాస్తవానికి ఈ భారీ ధరల పెరుగుదలకు చైనా కారణంగా వెల్లడైంది. ప్రపంచంలో చైనా బంగారం అతిపెద్ద ఉత్పత్తిదారుతో పాటు వినియోగదారుగా ఉన్న సంగతి తెలిసిందే. మధ్య ప్రాశ్చంలో దిగజారుతున్న పరిస్థితులతో పాటు అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించాలనుకోవటం పసిడి ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. అయితే ఇక్కడ పసిడి ధరల ర్యాలీ కొనసాగటానికి నిరంతరం చైనా నుంచి పెరుగుతున్న కొనుగోళ్లుగా వెల్లడైంది. సెంట్రల్ బ్యాంకుల నుంచి రిటైలర్ల వరకు అందరూ అనిశ్చితి కాలాల్లో తమ సంపదను కాపాడుకోవటం కోసం బంగారంలో ఇన్వెస్ట్ చేస్తారని మానందరికీ తెలిసిందే.

ప్రపంచంలోనే గోల్డ్ అతిపెద్ద కొనుగోలుదారు అనే టైటిల్‌పై చైనా, భారత్ సాధారణంగా పోటీ పడ్డాయి. కానీ గత సంవత్సరం చైనాలో నగలు, బార్లు, నాణేల వినియోగం రికార్డు స్థాయికి పెరగడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చైనాలో బంగారు ఆభరణాల డిమాండ్ 10 శాతం పెరగగా.. ఇండియాలో ఇది 6 శాతంగా ఉంది. చైనాలో పెట్టుబడుల కోసం గోల్డ్ కొనుగోలు ఏకంగా 28 శాతం పెరిగింది. ఇంకా డిమాండ్ పెరగడానికి ఇంకా స్థలం ఉందని హాంకాంగ్‌కు చెందిన కన్సల్టెంట్ ప్రెషియస్ మెటల్స్ ఇన్‌సైట్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఫిలిప్ క్లాప్‌విజ్క్ అన్నారు. చైనా రియల్టీ రంగం కుప్పకూలటంతో చాలా మంది చైనీయుల దృష్టి పసిడిపై పడింది. వాస్తవానికి చైనాలో బంగారం గనులు ఉన్నప్పటికీ.. గడచిన రెండేళ్లుగా విదేశాల నుంచి 2,800 టన్నుల గోల్డ్ దిగుమతి చేసుకుంది. పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా వరుసగా 17 నెలల పాటు కొనుగోళ్ల జోరును కొనసాగిస్తోంది. ఇది తన నిల్వలను డాలర్‌కు దూరంగా ఉంచడంతోపాటు కరెన్సీ తరుగుదల నుంచి రక్షణ కల్పించాలని చూస్తున్నందున కొనుగోళ్లు ఎక్కువ కాలం కొనసాగాయి. వాస్తవానికి చైనాలోని ప్రజలు ధరలు తగ్గినప్పుడు మాత్రమే గోల్డ్ కొంటుంటారు. అయితే ఈ సారి మాత్రం అధిక ధరలు కొనసాగుతున్నప్పటికీ వారు ఎక్కువగా కొనుగోళ్లకు దిగటంతో ప్రపంచ వ్యాప్తంగా పసిడి ధరల ర్యాలీ కొనసాగుతోంది. గోల్డ్ ధరల ర్యాలీపై ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలని చైనాలో అధికారులు ఇన్వెస్టర్లను హెచ్చరిస్తున్నారు.