ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (TCS),టీసీఎస్ ఐయాన్ (tcs ion) పేరుతో 15 రోజుల పాటు డిజిటల్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌ను అందిస్తుంది.
టీసీఎస్ ఐఓఎన్ కెరియర్ ఎడ్జ్‌లో ఈ కోర్సులను ఉచితంగా అందుబాటులో ఉంచింది. విద్యార్థులు, ఉద్యోగులు వారి కెరీర్ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఈ కోర్సు ఉపయోగపడుతుంది. ఈ ప్రోగ్రామ్‌లో మొత్తం 14 డిఫరెంట్ మాడ్యుల్స్ ఉంటాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ కోర్సుకు అప్లై చేసుకోవచ్చు.
అర్హత: అండర్ గ్రాడ్యుయేట్లు, గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ఫ్రెషర్స్ ఎవరైనా అప్లై చేయవచ్చు.
నేర్చుకునే అంశాలు
వర్క్ ప్లేస్‌లో ఇతరులతో కలిసి సమర్థవంతంగా ఎలా పనిచేయాలి
డెవలప్ సాఫ్ట్‌స్కిల్స్ ఫర్ ద వర్క్‌ప్లేస్
రైట్ ఎ విన్నింగ్ రెజ్యూమె అండ్ కవర్ లెటర్
అకౌంటింగ్ ఫండమెంటల్స్
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ గురించి తదితర విషయాలపై అవగాహన కల్పిస్తారు.
నానో ట్యుటోరియల్ వీడియోలు, కేస్‌స్టడీస్, అసెస్‌మెంట్లు కోర్సులో భాగంగా ఉంటాయి. ఆంగ్లభాషలో బోధన ఉంటుంది. అసెస్‌మెంట్లు అభ్యర్థి బలాలు, బలహీనతలు తెలుసుకోవడానికి సాయపడతాయి. టీసీఎస్ నిపుణులు వెబినార్లనూ నిర్వహిస్తుంటారు. 15 రోజుల కోర్సు పూర్తిచేసుకున్నాక ఎండ్ ఆఫ్ కోర్స్ అసెస్‌మెంట్ ఉంటుంది.