ప్రముఖ గవర్నమెంట్ సంస్థ సింగరేణి భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. 327 ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు ఏప్రిల్ 15 నుంచి మే 4 వరకు అప్లికేషన్లు స్వీకరిస్తామని అధికారులు పేర్కొన్నారు. అయితే ఆ తేదీల్లో మార్పులు ఉన్నట్లు తాజాగా కొత్త తేదీలను ప్రకటించారు.. మే 15 నుంచి జూన్ 4వ తేదీ అప్లై చేసుకొనే అవకాశాన్ని కల్పిస్తున్నారు.. ఈ ఉద్యోగాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం..
మొత్తం పోస్టులు..327
పోస్టుల వివరాలు..
ఎగ్జిక్యూటివ్ కేడర్: మేనేజ్‌మెంట్ ట్రెయినీ(ఈ-ఎం), ఈ2 గ్రేడ్-42, మేనేజ్‌మెంట్ ట్రెయినీ(సిస్టమ్స్), ఈ2 గ్రేడ్-07.
నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్: జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రెయినీ(జేఎంఈటీ), టీ-ఎస్ గ్రేడ్ సీ-100, అసిస్టెంట్ ఫోర్‌మ్యాన్ ట్రెయినీ(మెకానికల్)టీ-ఎస్ గ్రేడ్ సీ-09, అసిస్టెంట్ ఫోర్‌మ్యాన్ ట్రెయినీ(ఎలక్ట్రికల్)టీ-ఎస్ గ్రేడ్ సీ-24, ఫిట్టర్ ట్రెయినీ, క్యాట్ 1-47, ఎలక్ట్రీషియన్ ట్రెయినీ, క్యాట్ 1-98 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు..
అర్హతలు..
ఈ పోస్టులకు డిగ్రీ పీజీ, ఐఐటీ, డిప్లొమా లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి..
వయసు..
పోస్ట్‌ను అనుసరించి జూన్ 1, 2024 నాటికి కనీస వయసు 18 ఏళ్లు, గరిష్ట వయసు 30 ఏళ్లు ఉండాలి.. మిగిలిన వారికి వయసులో సడలింపు ఉంటుంది..
ఎంపిక ప్రక్రియ..
రాత పరీక్ష, మెరిట్ జాబితా రూపొందిస్తారు. టైపింగ్, డేటాఎంట్రీ, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ విభాగాల్లో స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు..
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం తేదీ, చివరి తేదీలు : 15.05.2024 నుంచి 04.06.2024 వరకు అప్లై చేసుకోవచ్చు..
వెబ్‌సైట్: https://scclmines.com/ .. ఈ పోస్టుల గురించి మరిన్ని విషయాలను తెలుసుకోవాలంటే ఈ వెబ్ సైట్ ను పరిశీలించండి..
ఉద్యోగాల భర్తీకి మార్చి నెలలో నోటిఫికేషన్ జారీ చేసింది. తాజా ప్రకటన ప్రకారం ఈ పోస్టులకు మే 15వ తేదీ నుంచి జూన్ 4వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.. ఈ విషయాన్ని గుర్తుంచుకోని అప్లై చేసుకోగలరు..