Hyderabad: ఐటీ కారిడార్ లో డెంజర్ బెల్స్.. !

www.mannamweb.com


తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. భారీగా ఉష్ణోగ్రతలు పెరుగుతోన్నాయి. రాజధాని హైదరాబాద్ లో కూడా భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ప్రజలు ఎండ వేడిమితో పాటు నీటి కొరతతో ఇబ్బంది పడుతున్నారు.
భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు ఎండిపోయాయి. దీంతో జలమండలి నళ్లపై ఆధారపడాల్సి వస్తుంది. నళ్ల నీళ్లు కూడా సరిపోక చాలా మంది ట్యాంకర్లు తెప్పించుకుంటున్నారు. ఇక ఫైనాన్షయల్ డిస్ట్రక్ట్ లో నీటి కొరత తీవ్రంగా ఉంది.

ఐటీ కారిడార్ లో నీరు లేక జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంతంలో తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ ఇళ్లు ఉండడంతో బోర్లు ఉన్నా నీరు సరిపోవడం లేదు. బోర్ల నీరు లేక ట్యాంకర్లను తెప్పించుకుంటున్నారు. గచ్చిబౌలి ప్రాంతంలో ప్రతి సంవత్సరం ఇదే సమస్య వస్తుందని స్థానికులు చెబుతున్నారు. ఇష్టానుసారంగా నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడంతోనే సమస్య వస్తుందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం జలమండలి సరఫరా చేస్తున్న నీళ్లు సరిపోవడం లేదంటున్నారు.
శేరిలింగంపల్లి, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఐటీ కంపెనీలు ఉన్నాయి. కంపెనీలకు దగ్గరగానే లక్షల్లో ఇళ్లను నిర్మించారు. ఈ ప్రాంతాల్లో మొత్తం దాదాపు లక్ష 50 వేళ ఇళ్లు ఉన్నాయి. ఇందులో హాస్టళ్లు, ఇళ్లు, హైరైజ్ భవనాలు, విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలు ఉన్నాయి. అయితే అధికారలు రెండు అంతస్థులకు అనుమతి ఇస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు నాలుగు అంతస్థులు కడుతున్నారు. దీంతో తక్కువ జాగాలో ఎక్కువ ఇళ్లు కట్టడంతో నీటి సమస్య వస్తుంది.

జలమండలి ఈ ప్రాంతాలకు రోజుకు 9 ఎంజీడీల నీటిని ఇస్తోంది. అయినా కూడా నీరు సరిపోవడం లేదు. నళ్ల నీళ్లు సరిపోకుంటే జలమండలి 2100 ట్యాంకర్లు పంపిస్తుంది. అయినా కూడా నీరు సరిపోవడం లేదు. ఓ అపార్ట్ మెంట్ లో 30 ప్లాట్లు ఉన్నాయి. ఇందులో బోరు ఉంటే ఎండిపోయింది. జలమండలి నీరు సరిపోక రోజుకు 4 ట్యాంకర్లు కొనుగోలు చేస్తున్నామని చెబుతున్నారు.