ప్రతి విద్యార్థి జీవితంలో గురువుది కీలకపాత్ర. పాఠాలు చెప్పడంతోనే బాధ్యత తీరిపోతుందనే భావన లేకుండా.. జీవిత పాఠాలను కూడా నేర్పిస్తారు గురువులు. అలాంటి గొప్ప మనసుండే ఓ గురువును శిష్యులు సర్‌ప్రైజ్ చేశారు.. ఆయన ఊహించని గిఫ్ట్‌ను ఇచ్చారు. జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన గురువుకు శిష్యులు ఏకంగా కారును బహుమతిగా ఇచ్చారు.
పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం మద్దిరాల జవహర్ నవోదయ విద్యాలయలో బండి జేమ్స్ ఆర్ట్స్ ఉపాధ్యాయుడు. గతంలో అనంతపురం జిల్లాలోని లేపాక్షి నవోదయ, నెల్లూరు జిల్లా నవోదయలో బోధించి, 2016 నుంచి మద్దిరాల నవోదయలో పనిచేస్తున్నారు. ఏప్రిల్ 30తో ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడిని సత్కరించి గురుదక్షిణ ఇవ్వాలని లేపాక్షి నవోదయ పూర్వ విద్యార్థులు నిర్ణయించుకున్నారు.
ఆదివారం మద్దిరాల నవోదయలో సన్మానోత్సవం ఏర్పాటు చేసి… కార్యక్రమం మధ్యలో ఓ కారు తెచ్చి జేమ్స్ దంపతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ నల్లూరి నరసింహారావు, ఇతర అధ్యాపకులు లేపాక్షి పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు జేమ్స్ దంపతులను సత్కరించారు. గురువుకు శిష్యుల్ ఇచ్చిన కారు విలువ ఏకంా రూ.12లక్షలు.
కడుపున పుట్టిన బిడ్డలు ప్రయోజకులైన రోజు తల్లిదండ్రులు ఎంత సంతోషపడతారో.. వారి కన్నా ఎక్కువ ఆనందపడేవారు ఎవరైనా ఉన్నారా అంటే.. వాళ్లే ఉపాధ్యాయులు.
తాము విద్యాబుద్ధులు నేర్పిన విద్యార్థులు.. జీవితంలో ఉన్నత స్థానాలకు చేరితే.. తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా టీచర్లే సంబరపడతారు. కేవలం పుస్తకాల్లోని పాఠాలు మాత్రమే జీవిత పాఠాలను బోధిస్తూ.. వారిని మంచి మార్గంలో నడిపిస్తూ.. జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకునేలా ప్రోత్సాహం, మద్దతిస్తారు టీచర్లు. విద్యార్థుల జీవితాల్లో గురువుది కీలక పాత్ర అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక తమ జీవితాల్లో ముఖ్య పాత్ర పోషించి… లైఫ్‌లో ఉన్నత స్థాయికి చేరుకునేలా ప్రోత్సాహించిన గురువుకు మర్చిపోలేని గురు దక్షిణ సమర్పించారు కొందరు విద్యార్థులు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ వివరాలు.
ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలంలో చోటు చేసుకుంది. జిల్లాలోని మద్దిరాల జవహర్ నవోదయ విద్యాలయలో బండి జేమ్స్ అనే వ్యక్తి ఆర్ట్స్ ఉపాధ్యాయుడుగా పని చేస్తున్నాడు. ఆయన గతంలో అనంతపురం జిల్లాలోని లేపాక్షి నవోదయ, నెల్లూరు జిల్లా నవోదయలో బోధించారు. ఇక 2016 నుంచి మద్దిరాల నవోదయలో పనిచేస్తున్నారు. ఏప్రిల్ 30తో ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడిని సత్కరించి గురుదక్షిణ ఇవ్వాలని లేపాక్షి నవోదయ పూర్వ విద్యార్థులు నిర్ణయించుకున్నారు. అయితే గురు దక్షిణగా ఏదో శాలువా కప్పి.. సత్కారం చేయడం కాకుండా.. వారు కాస్త భారీగా ఆలోచించారు. గురువుకు జీవితంలో మర్చి పోలేని బహుమతిని గురు దక్షిణగా ఇచ్చి.. కృతజ్ఞతలు తెలియజేశారు.
పూర్వ విద్యార్థులంతా.. ఆదివారం మద్దిరాల నవోదయలో ఆర్ట్స్ ఉపాధ్యాయుడు జేమ్స్‌కి సన్మానోత్సవం ఏర్పాటు చేశారు.. కార్యక్రమం మధ్యలో ఓ కారు తెచ్చి జేమ్స్ దంపతులకు బహుకరించి.. ఆయనకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ నల్లూరి నరసింహారావు, ఇతర అధ్యాపకులు లేపాక్షి పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు జేమ్స్ దంపతులను సత్కరించారు. జేమ్స్‌కు పూర్వ విద్యార్థులు.. గురు దక్షిణగా ఇచ్చిన ఈ కారు విలువ రూ.12లక్షలు. టీచర్ మీద ప్రేమతో ఇంత ఖరీదైన గిఫ్ట్ ఇవ్వడం ప్రస్తుతం సంచలనంగా మారింది. గురువుపై విద్యార్థులు చూపిన ప్రేమ ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది.