అనేక మంది షిర్డీ సాయిబాబాను(Shirdi sai baba), శని శింగనాపూర్(Shani Singanapur) శని దేవుడిని భక్తిశ్రద్ధలతో పూజించాలని భావిస్తారు. జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి పుణ్యక్షేత్రాలను దర్శించాలని అనుకుంటారు. అలాంటి వారికి గుడ్ న్యూస్.
అనేక మంది మహారాష్ట్ర(maharashtra)లోని షిర్డీ సాయిబాబాను(Shirdi sai baba), శని శింగనాపూర్(Shani Singanapur) శని దేవుడిని భక్తిశ్రద్ధలతో పూజించాలని భావిస్తారు. జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి పుణ్యక్షేత్రాలను దర్శించాలని అనుకుంటారు. అలాంటి వారికి గుడ్ న్యూస్. ఎందుకంటే IRCTC ఈ రెండు ప్రాంతాలకు ట్రైన్ ద్వారా వెళ్లేందుకు చాలా తక్కువ ఖర్చుతో ప్రయాణించే సౌకర్యం కల్పిస్తోంది. అయితే ఈ ప్యాకేజీ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ టూర్ ప్యాకేజీ పేరు: సాయి సన్నిధి ఎక్స్ హైదరాబాద్
ఈ ప్యాకేజీలో షిర్డీ, శని శింగనాపూర్ ప్రాంతాలను సందర్శించవచ్చు
ప్యాకేజీ కోడ్: SHR009
ప్రయాణ విధానం: రైలు
ఎన్ని రోజుల పర్యటన: 2 రాత్రులు, 3 రోజులు
రోజు: ప్రతి బుధవారం
ప్రయాణం: కాచీగూడ సాయంత్రం 6.40 గంటలకు ప్రారంభమవుతుంది
మీరు ఈ ప్యాకేజీని ఎంచుకుంటే మీరు రైలులో ప్రయాణించవచ్చు. ప్యాకేజీలో ఒక రోజు అల్పాహారం, స్లీపర్ క్లాస్, టోల్, పార్కింగ్, అన్ని పన్నులు ఉంటాయి. అదనంగా ప్రయాణికులకు ప్రయాణ బీమా అందించబడుతుంది. కానీ దేవాలయాలలో దర్శన టిక్కెట్లు. భోజనం, రాత్రి భోజనం, ఏదైనా అదనపు ఆహారం, రైలులో ఆహారం, టూర్ గైడ్, వ్యక్తిగత ఖర్చులు ప్యాకేజీలో చేర్చబడలేదు.
టికెట్ ధర ఎంత?
ఒకరి నుంచి ముగ్గురికి కలిపి టికెట్ బుక్ చేసుకుంటే (కంఫర్ట్ 3ఏ ఈ ప్యాకేజీ ధర ఒకరికి రూ.8,280, ఇద్దరికి రూ.7055, ముగ్గురికి రూ. 7040, 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు ఇద్దరు కలిసి బుక్ చేసుకుంటే బెడ్ లేని పిల్లలకు రూ.4350. అదే స్టాండర్డ్ (SL)లో ప్రయాణించాలనుకుంటే ఒక వ్యక్తికి రూ.6595, ఇద్దరు కలిసి బుక్ చేసుకుంటే ఒకరికి రూ.5370, ముగ్గురికి రూ.5350, 5 నుంచి 11 ఏళ్ల బెడ్ లేని పిల్లలకు 4145 రూపాయలు. టికెట్‌ను సులభంగా రద్దు చేసుకునే వెసులుబాటు ఉంది. 15 రోజులలోపు టికెట్ రద్దు చేసుకుంటే 250 రూపాయలు తగ్గించి మిగిలిన మొత్తం అందిస్తారు.