IPL 2024 Playoffs Scenario: పాపం.. ముంబై ఓటమితో ఆ 3 జట్లకు మైండ్ బ్లాంక్.. కట్‌చేస్తే.. ప్లేఆఫ్ రేసు నుంచి ఔట్?

www.mannamweb.com


IPL 2024 Playoffs Scenario: ఈ విజయంతో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ప్లేఆఫ్‌కు మరింత బలం చేకూర్చింది. 14 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. కాగా, ముంబై ఇండియన్స్ జట్టు 11 మ్యాచ్‌ల్లో 8 ఓటములతో 9వ స్థానంలో ఉంది. ఇప్పుడు ప్లేఆఫ్‌కు వెళ్లడం కష్టంగా మారింది. రాజస్థాన్ రాయల్స్ మొదటి స్థానంలో కొనసాగుతోంది. లక్నో సూపర్ జెయింట్స్ మూడో స్థానంలో, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నాలుగో స్థానంలో నిలిచాయి.

IPL 2024 Playoffs Scenario: ఐపీఎల్ 2024 (IPL 2024)లో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తమ సొంత మైదానంలో ముంబై ఇండియన్స్ (MI vs KKR)ని ఓడించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం, ముంబై ఓటమి తర్వాత, ప్లేఆఫ్‌కు వెళ్లే లెక్కలు మరోసారి మారిపోయాయి. ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ జట్టు దాదాపు ఈ సీజన్‌కు దూరమైనప్పటికీ, వారి ఓటమి ఇతర జట్లకు కూడా భారీ దెబ్బను మిగిల్చింది. అదేంటో ఇప్పుడు ఓసారి చూద్దాం..

పాయింట్ల పట్టికలో జట్ల స్థానం..
ఈ విజయంతో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ప్లేఆఫ్‌కు మరింత బలం చేకూర్చింది. 14 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. కాగా, ముంబై ఇండియన్స్ జట్టు 11 మ్యాచ్‌ల్లో 8 ఓటములతో 9వ స్థానంలో ఉంది. ఇప్పుడు ప్లేఆఫ్‌కు వెళ్లడం కష్టంగా మారింది. రాజస్థాన్ రాయల్స్ మొదటి స్థానంలో కొనసాగుతోంది. లక్నో సూపర్ జెయింట్స్ మూడో స్థానంలో, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నాలుగో స్థానంలో నిలిచాయి.

ముంబై ఓటమితో ఈ జట్లకు గడ్డుకాలం..
ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఓడిపోయి ఉంటే.. లక్నో సూపర్ జెయింట్, సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు లాభపడి ఉండేవి. దీనికి కారణం ఈ జట్లు ఇప్పటికీ KKR కంటే వెనుకబడి ఉన్నాయి. కేకేఆర్ ఓడిపోతే ఆయా జట్లు ముందుకు వెళ్లే అవకాశం ఉండేది. లక్నో, సన్‌రైజర్స్ ప్రస్తుతం 10 మ్యాచ్‌లలో 12 పాయింట్లను కలిగి ఉండగా, KKR అదే సంఖ్యలో మ్యాచ్‌ల నుంచి 14 పాయింట్లను కలిగి ఉంది. CSK కూడా 10 మ్యాచ్‌ల్లో 10 పాయింట్లు మాత్రమే సాధించింది. KKR మరో ఒకటి లేదా రెండు మ్యాచ్‌లు గెలిస్తే ప్లేఆఫ్‌కు వెళుతుంది. ఇటువంటి పరిస్థితిలో కేవలం రెండు స్థానాలు మాత్రమే మిగిలిపోతాయి. దీని కోసం చాలా జట్ల మధ్య పోరు జరుగుతుంది.

ఈ కారణంగా కోల్‌కతా నైట్ రైడర్స్ ఈ విజయం ఇతర జట్లకు కష్టాలను పెంచింది. ఇప్పుడు లక్నో, సన్‌రైజర్స్ నాలుగు మ్యాచ్‌లలో రెండింట్లో గెలవాల్సి ఉంటుంది. చెన్నై సూపర్ కింగ్స్ కనీసం మూడు మ్యాచ్‌లు గెలవాలి. ఇటువంటి పరిస్థితిలో ప్లేఆఫ్‌ల లెక్కలు ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారాయి.

IPL 2024 పాయింట్ల పట్టిక ఎలా ఉందంటే:
1) రాజస్థాన్ రాయల్స్ – 10 మ్యాచ్‌ల తర్వాత 16 పాయింట్లు

2) కోల్‌కతా నైట్ రైడర్స్ – 10 మ్యాచ్‌ల తర్వాత 14 పాయింట్లు

3) లక్నో సూపర్‌జెయింట్స్ – 10 మ్యాచ్‌ల తర్వాత 12 పాయింట్లు

4) సన్‌రైజర్స్ హైదరాబాద్ – 10 మ్యాచ్‌ల తర్వాత 12 పాయింట్లు

5) చెన్నై సూపర్ కింగ్స్ – 10 మ్యాచ్‌ల తర్వాత 10 పాయింట్లు

6) ఢిల్లీ క్యాపిటల్స్ – 11 మ్యాచ్‌ల తర్వాత 10 పాయింట్లు

7) పంజాబ్ కింగ్స్ – 10 మ్యాచ్‌ల తర్వాత 8 పాయింట్లు

8) గుజరాత్ టైటాన్స్ – 10 మ్యాచ్‌ల తర్వాత 8 పాయింట్లు

9) ముంబై ఇండియన్స్ – 11 మ్యాచ్‌ల తర్వాత 6 పాయింట్లు

10) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – 10 మ్యాచ్‌ల తర్వాత 6 పాయింట్లు