ఎలక్షన్ కమిషన్ తాజాగా ఓ కీలక ప్రకటన చేసింది. పోస్టల్ ఓటర్ల జాబితాలో పేర్లు లేని వారు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని.. తమ ఎన్నికల డ్యూటీ ఆర్డర్, గుర్తింపు కార్డును సంబంధిత ఫెసిలిటేషన్ సెంటర్‌కు తీసుకువెళ్లి ఓటు పొందవచ్చని తెలిపింది. ఇలాంటి వారి కోసం..
ఎలక్షన్ కమిషన్ (Election Commission) తాజాగా ఓ కీలక ప్రకటన చేసింది. పోస్టల్ ఓటర్ల జాబితాలో పేర్లు లేని వారు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని.. తమ ఎన్నికల డ్యూటీ ఆర్డర్, గుర్తింపు కార్డును సంబంధిత ఫెసిలిటేషన్ సెంటర్‌కు తీసుకువెళ్లి ఓటు పొందవచ్చని తెలిపింది. ఇలాంటి వారి కోసం ఈ నెల 7, 8 తేదీల్లో ఓటు వేయడానికి అవకాశం కల్పిస్తామని పేర్కొంది. ఈ మేరకు సీఈవో ముఖేష్ కుమార్ మీనా (Mukesh Kumar Meena) కీలక ప్రకటన చేశారు. విజయనగరం జిల్లా జేఎన్టీయూ గురజాడ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్‌ను ఆయన సందర్శించారు. ఓటింగ్‌కు చేసిన ఏర్పాట్లు, ఓటింగ్ ప్రక్రియ, హెల్ప్ డెస్క్స్, క్యూలెన్లు, పోలింగ్ బూత్‌లను పరిశీలించారు.
ఈ సందర్భంగా.. ఓటర్లతో మాట్లాడి వారి సమస్యలను, ఏర్పాట్లపై వారి అభిప్రాయాలను సీఈవో ముఖేష్ కుమార్ తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకునేందుకు గాను ఈ నెల 7, 8 తేదీల్లో మరో అవకాశం ఇస్తున్నామన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి ఉద్యోగికీ పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పించడమే లక్ష్యంగా తాము పని చేస్తున్నామని అన్నారు. అన్ని ఫెసిలిటేషన్ సెంటర్లలో కనీస మౌలిక సదుపాయాలను, హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా పక్కా ఏర్పాట్లు చేశామని.. ఎన్నికల సిబ్బందికి ఇప్పటికే రెండు విడతల శిక్షణ ఇచ్చామని చెప్పారు. వివిధ విభాగాల నుంచి తాము ఫిర్యాదుల్ని స్వీకరిస్తున్నామన్న ఆయన.. సీ-విజిల్ ద్వారా ఎక్కువ ఫిర్యాదుల అందుతున్నాయన్నారు. ఇప్పటివరకు సుమారు 16,000 ఫిర్యాదులు వచ్చాయని.. వీటిలో 99 శాతం ఫిర్యాదులపై చర్యలు తీసుకోవడం జరిగిందని స్పష్టం చేశారు.