ఈరోజుల్లో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది.. అయితే బరువు తగ్గడం కోసం ఎన్నెన్నో చేస్తుంటారు.. బరువు తగ్గితే సగం రోగాలు తగ్గుతాయని స్వయంగా వైద్యులే సలహా ఇస్తున్నారు.. బరువు తగ్గడం అంత సులువు కాదు..శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ నిలువ ఉండడం వల్ల హానికర బ్యాక్టీరియాలు పెరిగే అవకాశముంది. ఈ బరువుల సమస్యను కేవలం పానియాలు తాగి తగ్గించుకునే ప్రయత్నం చేయచ్చు.. ఇక ఆలస్యం ఎందుకు ఆ డ్రింక్స్ ఏంటో ఒకసారి చూద్దాం..
జీలకర్ర వాటర్..
జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.. ఇవి శరీరంలో వేడిని పెంచి బరువును తగ్గించడంలో సహాయ పడతాయి.. అలా బరువు తగ్గిపోతారు..
గ్రీన్ టీ..
గ్రీన్ టీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. కెటెచిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉండడం వల్ల కొవ్వు సులభంగా కరుగుతుంది. అందుకే రోజుకు ఒక కప్ తాగడం వల్ల బరువు త్వరగా తగ్గుతారు..
బ్లాక్ టీ..
బ్లాక్ టీ అంటే టీ డికాషన్.. అందరికీ తెలిసే ఉంటుంది. క్యాలరీలను బర్న చేసే కెఫిన్ ఉంటుంది. శరీరంలో కొవ్వును కరిగించి పాలిఫెనాల్స్ ఈ టీలో ఉండటం వల్ల బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..
నీళ్లు..
ప్రతి రోజు నీళ్లను ఎక్కువగా తీసుకోవాలి.. శరీరంలో 20 నుంచి 30 శాతం క్యాలరీలు బర్న్ అవుతాయని చెబుతున్నారు.. నీళ్లు ఎక్కువగా తాగే వాళ్లకు బరువు కంట్రోల్ లో ఉంటుంది.. అందుకే రోజులో కనీసం 3 నుంచి 4 లీటర్లు నీళ్లు తాగాలని నిపుణులు చెబుతున్నారు.
ఇవే కాదు ప్రోటీన్ డ్రింక్స్ తో పాటుగా యాపిల్ సైడర్ వెనిగర్ ను కూడా తాగవచ్చునని చెబుతున్నారు.. ముఖ్యంగా బరువు తగ్గాలనుకొనేవారు కాస్త వ్యాయామం కూడా చెయ్యడం మంచిది.. అప్పుడే బరువు కంట్రోల్ ఉంటుంది.