వేసవిలో జుట్టు సమస్యలు రావడం సర్వసాధారణమైపోయింది. జుట్టు సమస్యలతో బాధపడేవారు కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం మానుకోవాల్సి ఉంటుంది. ఈ కింది చిట్కాలను పాటించడం వల్ల కూడా సులభంగా జుట్టు చిట్లిపోవడం సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు.
వాతావరణంలో మార్పుల కారణంగా చాలామందిలో జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం ΄పొందడానికి మార్కెట్లో లభించే వివిధ రకాల సాధనాలను, కాస్మెటిక్ ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. అయినా, సరైన ఫలితాలను పొందలేకపోతున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలు పాటించడం, కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండటం ద్వారా కూడా జుట్టు రాలకుండా చూసుకోవచ్చు.
►ఎక్కువ చక్కెర కలిగిన ఆహారాలు తినడం వల్ల తీవ్ర చర్మ సమస్యలతో పాటు, జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడేవారు చక్కెర గల ఆహారాలు తీసుకోవడం మానుకోవాల్సి ఉంటుంది.
►జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల జట్టు రాలడం, తెల్ల జుట్టు సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి జుట్టు సమస్యలతో బాధపడుతున్నవారు జంక్ ఫుడ్స్‌కు దూరంగా ఉండడం చాలా మంచిది.
►ఆహారంలో పచ్చి గుడ్లను తీసుకోవడం వల్ల వాటిలో ఉండే హానికరమైన బ్యాక్టీరియా జుట్టుకు కూడా హాని కలిగిస్తుంది. కాబట్టి ఇప్పటికే జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడేవారు ఆహారంలో పచ్చి గుడ్లను తీసుకోకపోవడం ఉత్తమం.
►ఆల్కహాల్ సేవించడం వల్ల కూడా సులభంగా జుట్టు రాలడం మొదలవుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే హానికరమైన విషపదార్థాలు తీవ్ర జుట్టు సమస్యలకు దారి తీస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి కాబట్టి జుట్టును కా΄ాడుకోవాలనుకునేవారు ఆల్కహాల్‌కు దూరంగా ఉండటం మేలు.
►తేనె, పెరుగు హెయిర్ మాస్క్‌తో సులభంగా ఉపశమనం లభిస్తుంది:
►ప్రస్తుతం చాలామందిలో జుట్టు చివరి భాగాల్లో చిట్లిపోవడం వంటి సమస్యలు వస్తున్నాయి. వీటినే స్పి›్లట్ ఎండ్స్ అంటారు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తేనె, పెరుగు హెయిర్ మాస్క్ వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈ మాస్క్‌ను ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో అరకప్పు పెరుగు, 6 చెంచాల తేనె వేసి రెండూ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని వేళ్లతో తీసుకుని జుట్టు కుదుళ్లకు పట్టేలా రాసుకుని మృదువుగా మసాజ్ చేయాలి. ఆ తర్వాత ఒక గంట΄ాటు అలా వదిలేయాలి. బాగా ఆరిన తర్వాత జుట్టును తక్కువ గాఢత గల షాంపూతో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి.
వేసవిలో జుట్టు రాలడానికి సాధారణ కారణాలు
►అధిక ఉష్ణోగ్రత, సూర్యరశ్మికి గురికావడం వల్ల జుట్టు చిట్లడం, పల్చబడడం జరుగుతుంది.
►స్విమ్మింగ్ వల్ల కూడా జుట్టు రాలుతుంది. ఎందుకంటే పూల్ నీటిలో ఉండే క్లోరిన్ జుట్టుపై ప్రతికూల ప్రభావం చూపి జుట్టు రాలేలా చేస్తుంది.
►వేసవిలో చెమట వల్ల జుట్టు రాలడం అనేది సర్వసాధారణం.
►వేడి వాతావరణం చుండ్రును తీవ్రతరం చేస్తుందని అంటారు, దీనికి చికిత్స చేయకుండా వదిలేస్తే, తాత్కాలికంగా జుట్టు రాలిపోతుంది.
అలోవెరా జెల్
అలోవెరా జెల్‌ను జుట్టు మీద అప్లై చేయడం చాలా మంచిది. దానివల్ల జుట్టు మెరవడంతోబాటు మృదువుగా కూడా మారుతుంది. అంతేకాదు, చుండ్రు లేదా జుట్టు రాలడానికి కారణమయ్యే ఇతర ఫంగల్ ఇన్ఫెక్షన్తో పోరాడుతుంది. అలోవెరా జ్యూస్ తాగడం వల్ల జుట్టు లోపలి భాగంలో బలపడుతుంది.
కొబ్బరి పాలతో మసాజ్
జుట్టు రాలడానికి శీఘ్ర రెమెడీ కొబ్బరి ΄ాలతో తలకు సున్నితంగా మసాజ్ చేయడం. ఆ తర్వాత తలకు వెచ్చని టవల్ చుట్టడం. రెగ్యులర్ హెయిర్ వాష్, కండిషనింగ్‌తో ఈ చిట్కాను అనుసరించడం వల్ల హెయిర్ ఫాల్ సమస్య అదుపులోకి వస్తుంది.