Hormone Balancing Food: హార్మోన్ల సమస్యా..? ఈ ఫుడ్స్ తో బ్యాలెన్స్ చేసుకోండి

www.mannamweb.com


Hormone Balancing Food: హార్మోనల్ ఇన్‌‌‌బ్యాలెన్స్ అనేది ప్రస్తుతం సర్వ సాధారణంగా మారింది. అందుకు ప్రధాన కారణం జీవన శైలిలో వచ్చిన మార్పులు మాత్రమే. అంతే కాకుండా ఒత్తిడి, అనారోగ్య కరమైన ఆహారం తీసుకోవడం వల్ల ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. హార్మోన్ల అసమతూల్యత అనేది ప్రస్తుత కాలంలో స్త్రీలను ముఖ్యంగా వేధిస్తోంది.

హార్మోన్ల ప్రభావం మానవ శరీరంపై ఎంతగానో ఉంటుంది. అయితే హార్మోన్లు రక్తంలో కలిసి శరీరం అంతా వ్యాపిస్తాయి. హార్యోన్లు మానసిక, శరీర ఎదుగుదలకు ఉపయోగపడతాయి. జీవక్రియలు, వయస్సుకు తగిన మార్పులపై హార్మోన్లు ప్రభావం చూపిస్తాయి. హర్మోన్లు సమతుల్యం కోసం హెల్తీ ఫుడ్స్ తినాలి. అంతే కాకుండా ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవరచుకోవాలి.

ఆర్గానిక్ ఫుడ్స్: ఆర్గానిక్ ఫుడ్స్ తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అంతే కాకుండా నేచురల్ న్యూట్రీషియన్లను ఇవి కలిగి ఉండడం వల్ల హర్మోన్ లను బ్యాలెన్స్ గా ఉంచుతాయి.

ఫైబర్: హార్మోన్లు సమంగా ఉంచడంలో ఫైబర్ ఫుడ్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. గోధుమలు, బ్రెడ్ , బ్రూన్ రైస్ వంటివి హర్మోన్లు స్థిరంగా ఉంచడానికి సహాయపడతాయి. పచ్చి బఠానీలు, సోయా బీన్స్ వంటివి హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తాయి. వీటిలో ఉన్న పోషకాలు ఈస్ట్రోజన్ స్థాయి శరీరంలో సమంగా ఉంచడానికి ఉపయోగపడతాయి.

ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్: శరీరంలో హర్మోన్లను బ్యాలెన్స్ చేయడానికి బెస్ట్ రెమిడీ చేపలు అని చెప్పొచ్చు. వారానికి ఒక సారి మనం తినే ఆహారంలో చేపలను చేర్చుకోవడం వల్ల ఇవి ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఆలివ్ ఆయిల్, నట్స్, హోల్ గ్రెయిన్స్ ఆహారంలో భాగంగా చేసుకోవాలి.

ఫ్రూట్స్: బెర్రీస్ లో ప్లెవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి హార్మోన్లను సమంగా ఉంచడానికి ఉపయోగపడతాయి. సిట్రస్ పండ్లు, గ్రేప్స్, రెడ్ బెర్రీస్ హార్మోన్లను బ్యాలెన్స్ చేయడంలోముఖ్య పాత్ర వహిస్తాయి. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో అధికంగా ప్రోటీన్లు ఉంటాయి. ఇవి హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తాయి. అంతే కాకుండా హార్మోన్ల స్థాయి పెరగకుండా కంట్రోల్ చేస్తాయి.